కాశ్మీర్‌లో బీజేపీ, పీడీపీ సంకీర్ణానికి తెర

పీడీపీతో బంధం తెంచుకున్నట్లు ప్రకటించిన బీజేపీ ముఖ్యమంత్రి మొహబూబా ముఫ్తీ రాజీనామా గవర్నర్‌ చేతుల్లోకి పాలన శాంతిభద్రతలు అదుపులోకి తెచ్చేలా కేంద్రం దృష్టి న్యూఢిల్లీ, జూన్‌19(జ‌నం సాక్షి ) : జమ్ముకశ్మీర్‌లో బీజేపీ, పీడీపీ సంకీర్ణానికి తెరపడింది.. పీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి మంగళవారం బీజేపీ బయటకొచ్చేసింది. మంగళవారం ఉదయం బీజేపీ జాతీయ అధ్యక్షుడు … వివరాలు

అపర కుబేరుడిగా జెఫ్‌ బిజోన్‌

ఫోర్బ్స్‌ బిలియనీర్‌ జాబితా ప్రటన టాప్‌ వందలో నలుగురు భారతీయులకు చోటు న్యూయార్క్‌, జూన్‌19(జ‌నం సాక్షి) : ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మళ్లీ అమెజాన్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్‌ బిజోస్‌ నిలిచారు. ఫోర్బ్స్‌ బిలియనీర్‌ జాబితాను సోమవారం విడుదల చేశారు. 141.9బిలియన్‌ డాలర్ల సంపదతో బిజోస్‌ అపర కుబేరుడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. జూన్‌ 1 నుంచి … వివరాలు

విమానం ఇంజిన్‌లో మంటలు

ఆటగాళ్లు సురక్షితం మాస్కో, జూన్‌19(జ‌నం సాక్షి) : సౌదీ అరేబియా ఫుడ్‌బాల్‌ ఆటగాళ్లకు తృటిలో ప్రమాదం తప్పింది.  రష్యాలో ఫిఫా ప్రపంచకప్‌ పోటీలు ఆసక్తికరంగా జరుగుతున్నాయి. దేశంలోని వేర్వేరు నగరాల్లో ఉన్న వేదికలు పోటీలకు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు మ్యాచ్‌ల కోసం ఒక చోట నుంచి మరో చోటికి ప్రయాణించాల్సి ఉంటుంది. తాజాగా … వివరాలు

జపాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం

– రిక్టర్‌ స్కేల్‌పై 6.1 తీవ్రత – ముగ్గురు మృతి, క్షతగాత్రులుగా మారిన 240మంది – మృతుల సంఖ్య పెరిగే అవకాశం – సహాయక చర్యలు వేగవంతం చేసిన అధికారులు టోక్యో, జూన్‌18(జ‌నం సాక్షి) : భారీ ప్రకంపనలు జపాన్‌ను ఒక్కసారిగా వణికించాయి. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం పశ్చిమ జపాన్‌ కేంద్రంగా భూకంపం … వివరాలు

మహిళను మింగేసిన కొండచిలువ

ఇండోనేషియాలోని మునా ఐలాండ్‌లో ఘటన  మకస్సార్, జూన్ 16: తోట పనికి వెళ్లిన ఓ మహిళ కొండచిలువకు బలైపోయింది. పంటచేనులోకి వచ్చిన ఒక భారీ కొండచిలువ ఒకటి ఆమెను మింగేసినట్టు ఒకరోజు తర్వాత గుర్తించి.. కొండచిలువను కోసి మరీ మహిళ మృతదేహాన్ని స్థానికులు బయటకు తీసారు. ఈ విషాద ఘటన ఇండోనేషియాలోని మునా ఐలాండ్‌లో గురువారం … వివరాలు

డొనాల్డ్‌ ట్రంప్‌కు షాకిచ్చిన‌ అమెరికన్స్

ఒట్టావా(జ‌నం సాక్షి ): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు అమెరికన్లే షాకిచ్చారు. ఓ సర్వేలో మెజార్టీ అమెరికన్లు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోకు తమ మద్ధతు ప్రకటిస్తూ ఆశ్చర్యపరిచారు. జీ-7 దేశాల సదస్సు ముగిశాక.. వాణిజ్య ఒప్పందం అంశంలో ట్రంప్‌-ట్రూడోల మధ్య మాటల తూటాలు పేలుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెనెడాలోని ఓ న్యూస్‌ ఏజెన్సీ తాజా … వివరాలు

సుక్మా జిల్లాలో పోలీసులు, మావోల మధ్య కాల్పులు

 ముగ్గురు మావోయిస్టులు మృతి ఛత్తీస్‌గఢ్‌, జూన్‌15(జ‌నం సాక్షి ) : సుక్మా జిల్లాలోని చిత్రగుఫా ఏరియాలో శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. సుక్మా జిల్లా రిజర్వ్‌ గార్డ్‌ పోలీసులు, ఛత్తీస్‌గఢ్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సంయుక్తంగా కలిసి.. మావోయిస్టుల కోసం కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో చిత్రగుఫా … వివరాలు

డ్రాగన్‌ దిగుమతులపై ట్రంప్‌ సుంకం

వాణిజ్య యుద్ధానికి దారితీస్తాయంటున్న నిపుణులు అమెరికా, జూన్‌15(జ‌నం సాక్షి ) : చైనా దిగుమతులపై సుంకం విధించేందుకు ట్రంప్‌ సర్కార్‌ సిద్ధమైంది. ఇదే జరిగితే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధానికి దారితీసే అవకాశముంది. ఇప్పటికే కెనడా, మెక్సికో, ఐరోపా దేశాల నుంచి దిగుమతి అయ్యే ఉక్కు, అల్యూమినియంపై సుంకాలు విధించిన అగ్రరాజ్యం … వివరాలు

పాకిస్థాన్‌ తాలిబన్‌ చీఫ్‌ మౌలానా ఫజ్లుల్లా హతం

మలాలాపై కాల్పు జరిపిన  ఉగ్రవాది కాల్చివేత వెల్లడించిన అమెరికా దళాలు వాషింగ్టన్‌, జూన్‌15(జ‌నం సాక్షి ) : అఫ్గానిస్థాన్‌లోని తూర్పు కునార్‌ ప్రావిన్స్‌లో అమెరికా దళాలు జరిపిన డ్రోన్‌ దాడిలో పాకిస్థాన్‌ తాలిబన్‌ చీఫ్‌ మౌలానా ఫజ్లుల్లా హతమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొన్ని విూడియా వర్గాలు పేర్కొన్నాయి. ఆఫ్గాన్‌లో సీనియర్‌ ఉగ్రవాదులే లక్ష్యంగా డ్రోన్లతో … వివరాలు

దిగ్గజ కంపెనీ తొలి సీఎఫ్‌వోగా దివ్య రికార్డు

జనంసాక్షి: భారత మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది.  అమెరికాకు చెందిన అతిపెద్ద కార్ల కంపెనీ జనరల్‌ మోటార్స్‌ (GM)కు  చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ ( CFO )గా ఇండియాకు చెందిన (భారత సంతతి) దివ్య సూర్యదేవర నియమితులయ్యారు. ప్రస్తుతం ఈమె GM లో కార్పొరేట్‌ ఫైనాన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కంపెనీ … వివరాలు