అంబేడ్కర్‌ విగ్రహాన్ని యధాతథంగా ప్రతిష్టించాలి

share on facebook

హైదరాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): పంజాగుట్ట చౌరస్తాలో తొలగించిన అంబేడ్కర్‌ విగ్రహం ఉన్నచోటనే మరలా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కులవివక్ష పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు స్కైలాబ్‌ బాబు డిమాండ్‌ చేశారు. విగ్రహం తొలగించడంపై నిరసిన తెలిపేందుకు పంజాగుట్టకు చేరుకున్న ఆయనను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరసనలు తెలుపు కొనేందుకు అనుమతి కోరగా ప్రభుత్వం అనుమతించడం లేదన్నారు. అంబేడ్కర్‌ విగ్రహానికే రక్షణ లేనప్పుడు ప్రజలకేం రక్షణ కల్పిస్తుందని ఆయన విమర్శించారు. నిజామాబాద్‌ జిల్లాలో 170 గ్రామాల్లో సాంఘిక బహిష్కరణలు జరిగాయన్నారు. దళితులపై వివక్షత అన్యాయమన్నారు. ఆయనతో పాటు సుమారు 20మంది దళిత నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

Other News

Comments are closed.