అక్రమ ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తాం: వైకాపా

share on facebook

అనంతపురం,నవంబర్‌17(జ‌నంసాక్షి): రాప్తాడు మండలంలో అక్రమ ఓట్లను తొలగించే చర్యలకు వైకాపా శ్రీకారం చుట్టింది. కన్వీనర్‌ బోయ రామాంజనేయులు యూత్‌ కన్వీనర్‌ రెడ్డి సత్యనారాయణ రెడ్డి ల ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా బూత్‌ కమిటీలతో సమావేశాన్ని రాప్తాడు మండల కేంద్రంలోని వైసిపి కార్యాలయంలో శనివారం నిర్వహిస్తుంచారు. ఈ సమావేశానికి రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి హాజరయ్యారు. ఆరు మండలాలకు చెందిన బూత్‌ కమిటీ నాయకులు, సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా యూత్‌ కన్వీనర్‌ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అక్రమంగా ఓట్లు కలిగి ఉన్న వారిని గుర్తించి మండల ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లి వాటిని తొలగించే ప్రయత్నం చేయాలని చెప్పారు. ఓటు హక్కు లేని వారిని గుర్తించి కొత్తగా ఓటు నమోదు చేయించాలని కోరారు. ఎప్పటికప్పుడు ఓటర్‌ లిస్టులను గ్రామాల వారీగా బూత్ల వారీగా పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా రాప్తాడు మండల బూత్‌ కమిటీ మండల ఇన్చార్జిగా కొత్తపల్లి నారాయణ స్వామిని నియమించారు. ఈ కార్యక్రమానికి హిందూపురం పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి నాగేశ్వర్రెడ్డి, హిందూపురం పార్లమెంటు కమిటీ మేనేజర్‌ పోతుల శివారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్‌ రెడ్డి, నాయకులు ఇంద్రారెడ్డి, దండు అంజి, జూటూరు శేఖర్‌, ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షులు నారాయణస్వామి, బీసీ సెల్‌ సింగరప్ప, ఆలమూరు సుబ్బారెడ్డి అమర్నాథ్‌ రెడ్డి. ఎంపిటిసి గోవిందరెడ్డి, బాల పోతన్న, వాసుదేవ రెడ్డి బూత్‌ కమిటీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

 

 

Other News

Comments are closed.