అక్రమ రవాణా నిరోధానికి చర్యలు

share on facebook

ఖమ్మం,జనవరి23(జ‌నంసాక్షి):  ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో వివిధ శాఖలతో నిర్వహిస్తున్న చెక్‌పోస్టులను సమన్వయ పరిచడంతోపాటు నేరుగా ప్రజలనుంచి సమాచారం సేకరించేందుకు సామాజిక మాధ్యమానలు వినియోగించుకుని ముందుకు సాగుతున్నారు.  జిల్లాతోపాటు ఇతర రాష్టాల్రనుంచి కూడా అక్రమ రవాణా జరగుతున్న అనేక వస్తువులకు పన్నులు చెల్లించకుండానే తరలిస్తున్నారని, దీనిని అధికారులు చూస్తూ కన్నులు మూసుకుంటున్నారని ఇది సరైన పద్దతి కాదన్నారు. ప్రధానంగా ఇసుక, అటవీసంపద, నల్లబెల్లం, పీడీఎస్‌ బియ్యం, గంజాయి తదితరాలపై నిఘా పెట్టేందుకు చెక్‌పోస్టులను నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి శాఖ కూడా సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని, తద్వారా ఫలితాలు  సకాలంలో వస్తాయన్నారు. అధికారులు కూడా తాము తీసుకున్న చర్యలు, ఎప్పటికప్పుడు సీజ్‌ చేసిన వసూలుచేసిన సొమ్ము గురించి వాట్సప్‌ గ్రూపులో సమాచారం ఇవ్వాలన్నారు. ఎక్కడెక్కడ ఎంతెంత పట్టుకున్నారు., ఎంత ఫైన్‌ వసూలు చేసారు వాహనాల నంబర్లతో సహా ఇవ్వాలన్నారు.

Other News

Comments are closed.