అడవుల జిల్లాలో మొక్కలు సిద్దం

హరితహారానికి సిద్దంగా శ్రీరాంపూర్‌లో మొక్కలు
ఆదిలాబాద్‌, జూన్‌ 20 (జ‌నంసాక్షి): తెలంగాణా రాష్ట్రంలో పచ్చదనం కరువై పర్యావరణ సమతుల్యత పెరిగిపోతుందని తత్పలితంగానే వానలు కురవడంలేదని గుర్తించిన రాష్ట్రప్రభుత్వం ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో కూడా మొక్కలను నాటించాలని తలపించింది,. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటుం ది. ఇందులో బాగంగా భూగర్బ గనులతో వేడి తీవ్రంగా ఉన్న సింగకేణి ప్రాంతంలో కూడా చెట్లను పెంచాలని నిర్ణయించిందిప్రభుత్వం. దీంతో నల్లనేలలుగా పేరున్న ఆదిలాబాద్‌ జిల్లా తూర్పు ప్రాంతంలో ఉన్న మైదానప్రదేశాలను పచ్చదనంతో నింపాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతుంది జిల్లా యంత్రాంగం. దీనికి సింగరేణి కూడా ఊతమిస్తుండడంతో ప్రభుత్వ ఆశయానికి చేదోడుగా నిలిచేందుకు చర్యలు సిద్దమయ్యాయి. పచ్చదనంతో కూడిన తెలంగాణా కోసం కృషి చేస్తున్న ప్రభుత్వానికి సింగరేణి తోడ్పాటు నందించనుంది. ఇందుకోసం శ్రీరాంపూర్‌ పరిదిలో పెద్ద సంఖ్యలో మొక్కలను పెంచుతున్నది. ఈనెలాఖరులో మొక్కలను నాటించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైంది. సింగరేణి యాజమాన్యం కాలుష్య నివారణకు పెద్ద ఎత్తున ప్లాంటేషన్స్‌ ఏర్పాటు చేస్తున్నది. నర్సరీల్లో మొక్కలు పెంచుతూ గనులు, ఓసీపీలు పరిసర ప్రాంతాల వద్ద మొక్కలు నాటనుంది. ఇక హరితహారం పథకానికి కూడా సింగరేణి మొక్కలు సరఫరా చేయనుంది. ఈసారి మొక్కల పెంపకం ఎక్కువగానే చేపట్టింది. శ్రీరాంపూర్‌ పరిధిలో 13 లక్షల మొక్కలు నాటేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నది. శ్రీరాంపూర్‌లో ఓసీపీ జీఎం కార్యాలయం సవిూపంలో సీసీసీ అతిథి గృహం వద్ద నర్సరీలున్నాయి. యాజమాన్యం ఈనాలుగు నర్సరీల్లో సుమారు 43 జాతులకు సంబందించిన వివిద రకాలకు చెందిన 13 లక్షల మొక్కలు పెంచుతున్నది. సింగరేణి పరిసరర ప్రాంతాల ప్రజలకు ఉచితంగా మొక్కలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. కాలనీలు అందంగా కనిపించడానికి వివిద రకాల పూల మొక్కలతోపాటు కొన్ని రకాల పండ్ల మొక్కలను సిద్దం చేసింది, మరికొన్నింటిని కొనుగోలు చేసి మరీ అందించనుంది యాజమాన్యం. అంతరించిపోతున్న అటవీ జాతి మొక్కల పెంపకానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు సింగరేణి ఫారెస్ట్‌ విభాగం అధికారులు తెలుపుతున్నారు. సింగరేణి యాజమాన్య నర్సరీల్లో 43 జాతులకు సంబందించిన మొక్కలను పెంచుతున్నారు. అందులో నీలగిరి, చిందుగా మారేడు, బాంబో, నారవేప, తాని, ఉసిరి, వెలగ, దుర్శెనం, బూరుగ, కరక, తాప్సి, జిట్రేగు, వేప, మద్ది, బట్టగానం, వేగిసా, మర్రి, ఇప్ప, రావి, పారిజాతం, చింత, అల్లనేరడి, చండ్ర, టేకు, ఎర్రచందనం పలిచింత తదితర రకాల మొక్కలుఅందుబాటులో ఉంచారు. అయితే శ్రీరాంపూర్‌ పరిధిలో ఎటూ 30 కిలోవిూటర్ల పరిధిలోని జాతీయ రహదారి, అంతర్గత రోడ్లకు ఇరువైపులా ఈఏడాది మొక్కలు నాటాలని యాజమాన్యం నిర్ణయించింది, శ్రీరాంపూర్‌ ఏరియాలో 70 హెక్టార్లలో మొక్కలు నాటనున్నారు. 50 హెక్టార్లు శ్రీరాంపూర్‌ ఓసీపీ ఓబి మట్టిగుట్టపైన, 20 హెక్టార్లు సింగరేణి కాళీ ప్రదేశాల్లో నాటడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 15 హెక్టార్లు గోదావరి నది ఒడ్డున నాటాలని నిర్ణయించారు. వర్షాపాతంతో భూమిని కనీసం 30 సెంటీ విూటర్లు మెత్తబడగానే మొక్కలు నాటడానికి యాజమాన్యం సిద్దంగా ఉందని అధికార వర్గాలు చెపుతున్నాయి.శ్రీరాంపూర్‌ను త్వరలోనే హరిత వనంగా తీర్చిదిద్దే అడుగులు త్వరలోనే వేయనున్నామని, కొద్ది సంవత్సరాలలోనే అనూహ్య ఫలితాలు సాధించనున్నామని అధికారులు చెపుతున్నారు.