అధికారమే లక్ష్యంగా బాబు పాలన: డిసిసి 

share on facebook

కాకినాడ,మార్చి12(జ‌నంసాక్షి): కేవలం అధికారమే లక్ష్యంగా టిడిపి పాలన సాగుతోందని, సామాన్యులను పట్టించుకోవడం లేదని డీసీసీ అధ్యక్షుడు పంతం నానాజీ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ  ప్రజల సమస్యలే అజెండాగా కాంగ్రెస్‌  పోరాటం సాగిస్తున్నదని అన్నారు. ప్రత్యేక ¬దా, గిరిజన సమస్యలపై ఆందోలన
నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. రాష్ట్రానికి  తాగు, సాగు నీటిని అందించే లక్ష్యంతో చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తెదేపా ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని అన్నారు.  కేవలం రూ.16 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు చేపట్టినప్పటికీ ప్రస్తుతం దాని అంచనాలు రూ.40 వేల కోట్లకు పెంచేసి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజాసంక్షేమాన్ని పరిరక్షించడంతో తెలుగుదేశం, ప్రతిపక్ష వైకాపాలు పూర్తిగా విఫలమయ్యాయని  ఆరోపించారు. రాష్ట్ర విభజన, వైకాపా ఆవిర్భావం వంటి కారణాలతో ప్రజలు భావోద్వేగంతోనే కాంగ్రెస్‌కు దూరం అయ్యారని, తిరిగి ప్రజల విశ్వాసాన్ని సంపాదించి రానున్న 2019 ఎన్నికల్లో సత్తా చాటుతామని అన్నారు. ఇందుకు ప్రతిఒక్కరూ  పనిచేయాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. కాంగ్రెసు పార్టీ హయాంలో ఎన్నో పదవులను అనుభవించిన నాయకులు జెండాలు మార్చుతూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.

Other News

Comments are closed.