అధికారుల ఉదాసీనత విచ్చలవిడిగా బోర్ల తవ్వకాలు 

share on facebook

నల్గొండ,ఆగస్ట్‌19 (జనం సాక్షి) : అధికారుల్లో నెలకొన్న ఉదాసీనత వైఖరిని కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా వాల్టాచట్టం క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. బోరుబావుల తవ్వకం, చెట్లనరికివేత, నదులు, వాగుల నుంచి ఇసుకతీత, తాగునీటి వనరుల కలుషితం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్టపడక పోగా, వాల్టా చట్టంలోని నియమనిబంధనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. వర్షాభావంతో చాలాచోట్ల ఇష్టం వచ్చినట్లుగా బోర్ల తవ్వకం చేపడుతున్నారు. బోరుబావుల రిజిస్టేష్రన్‌ చట్టం ప్రకారం ప్రతిబావి యజమానీ 10 రూపాయలను రెవెన్యూ కార్యాయలంలో చెల్లించి రిజిస్టేష్రన్‌ చేయించుకోవాలి. బోరు తవ్వకం సమంలో సవిూపంలోని మరోబోరు, బావికి కనీసం 200 విూటర్ల దూరం పాటించాలి. కొత్తగా బోరుబావి వేసుకునే రైతు అధికారులకు సమాచారం ఇవ్వడం ద్వారా శాస్త్రీయపద్ధతులను అనుసరించి జియాలాజికల్‌ అధికారులు సర్వే నిర్వహిస్తారు. అధికారులు సూచించిన ప్రదేశంలో బోరుబావి పడకుంటే రూ.10వేల వరకు బాధిత రైతుకు బీమా సౌకర్యం లభిస్తుంది. అయితే రైతుల్లో నెలకొన్న అవగాహన లోపంతో తమ ఇష్టానుసారంగా బోరుబావులు తవ్వించి ఆర్థికంగా నష్టపోతున్నారు. రిగ్గుల రిజిస్టేష్రన్‌ బోరుబావులు తవ్వే రిగ్గుల యజమాని రూ.10వేలు చెల్లించి రిజిస్టేష్రన్‌ చేయించుకోవాలి. రిజిస్టేష్రన్‌ లేకుండా బోరుబావులను తవుతున్న రిగ్గులను అధికారులు సీజ్‌చేయాల్సి ఉంటుంది. అలాంటి చర్యలేవీ లేకపోవడంతో రిగ్గుల యాజమాన్యాలు తమకు నచ్చిన ప్రదేశంలో బోరుబావి తవ్వకాలు చేపట్టి రైతుల నుంచి వేలాది రూపాయాలు వసూలు చేస్తున్నారు.  పర్యావరణం, భూగర్భజలాలు, సహాజవృక్షసంపద పరిరక్షణ కోసం వాల్టా చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. అమలులో పారదర్శకత కొరవడి ఉల్లంఘన చర్యలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారుల మధ్య అవగాహన లోపంతో చట్టం
ఉల్లంఘనదారులపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వెలువడుతున్నాయి.  భవిష్యత్‌ అవసరాలను దృష్టి లో ఉంచుకొని ప్రభుత్వం కొన్ని నిమయనిబందనలు అందులో పొందుపరిచారు. మునిసిపల్‌ కార్పొరేషన్‌, మునిసిపాలిటీ-, గ్రామపంచాయతీల పరిధిలో చెట్లను పరిరక్షించి వాతావారణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు రెవెన్యూ, అటవీ శాఖ, గ్రామపంచాయతీ అధికారులు కృషి చేయాలి. ఎవరైనా చెట్ల యజమానిచెట్లను తన అవసరాల కోసం పడ గొట్టాలనుకుంటే అధికారుల నుంచి అనుమతిపొందాలి. చెట్లను నరికివేసిన 30 రోజుల వ్యవధిలో సవిూప ప్రదేశంలో రెండు మొక్కలు నాటాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులకు అప్పగించిన బాధ్యతలను క్షేత్రస్థాయిలో అమలు చేయకపోవడంతో గ్రామాల్లోని సహజ అటవీ వృక్ష సంపద తగ్గుతున్నది. బొగ్గుబట్టీల వ్యాపారులు గ్రామశివారు భూముల్లోని చెట్లను నరికించి కాల్చడంతో తయారైన బొగ్గొను ఇతరప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా సవిూపగ్రామాల్లో వాతావరణ కాలుష్యం పెరుగుతున్నది. నీటి కలుషితంపై నియంత్రణ భూగర్భజలాలు కలుషితం కాకుండా నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి.

Other News

Comments are closed.