అన్నదాతను గట్టెక్కించడంలో కేంద్రం విఫలం

share on facebook


రాష్ట్రాలతో సమన్వయం లేకుండా పథకాల ప్రకటన
సమిష్టి నిర్ణయాలతో రైతులకు ఉపకారం
తెలంగాణ విధానాలు ఆదర్శం కావాలి
హైదరాబాద్‌,జనవరి5(జ‌నంసాక్షి): దేశంలో అన్నదాతలను ఆదుకునేందుకు రకరకాల వాగ్దానాలు చేసిన ప్రదాని గత నాలుగున్నరేళ్లలో ఏ ఒక్క విషయంలోనూ విజయంసాధించలేకపోయారు. కేంద్రంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాల భాగస్వామ్యం లేకుండా నడుస్తున్నాయి. కానీ తెలంగాణలో సిఎం కెసిఆర్‌ మాత్రం ఓ పక్కా ప్రణాళికతో రైతుల బాగుకోసం తీసుకుంటున్న చ్యలు దీర్ఘకాలిక ప్రయోజనాలు కలిగించేవిగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో అమలయ్యేలా రాష్ట్రాలను కలుపుకుని పోవడంలో ప్రధాని మోడీ విఫలంకావడం వల్లనే రైతులకు సంబందించిన లేదా వ్యవసాయానికి సంబంధించిన పథకాలు అమలు కావడం లేదు. అన్నదాత అంటూ కీర్తిస్తూ..దేశానికి వెన్నముక అంటూ పొగడడమే తప్ప మరోటి జరగడం
లేదు. కార్పోరేట్‌ కంపెనీలకు దోచిపెడుతున్నా, బ్యాంకులు లూటీ అవుతున్నా అన్నదాతలను మాత్రం ఆదుకున్న దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు విషయాలు అధ్యయనం చేసి, అమలు చేసిన తీరు చూస్తేనే వ్యవసాయరంగంపై ఆయన దార్శనికత కనిపిస్తుంది.  భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో రావాల్సిన సాంకేతిక మార్పులతో సహా ఆర్థిక సాయం, పంటల కొనుగోళ్లు తదితర అంశాలపై ప్రకటించిన వివరాలు అన్నదాతకు భరోసా కలిగించేలా ఉన్నాయి. నిజానికి వ్యవసాయరంగం సంక్షోభంలో ఉంది. ఇప్పటికీ కూలీల సమస్య ఉంది. కరెంట్‌ సమస్య తీరినా పండించిన పంటలకు గిట్టుబాటు ధరనలు దక్కడం లేదు. ఎరువులు పురరుగు మందుల ధరలతో కుదేలవుతున్నారు. ఈ దశలో ఉపాధి హావిూ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని కేంద్రానికి పదేపదే విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇప్పటికే ప్రధానికి లేఖలు కూడా రాశానని తెలిపారు. పెట్టుబడి కింద ఇస్తామన్న ఆర్థిక సాయాన్ని నేరుగా ఖాతాల్లో జమచేశారు. అలాగే రైతు సమన్వయ సమితుల ద్వారానే పంటల కొనుగోళ్లకు 12వేల కోట్లు కేటాయి స్తామని చేసిన ప్రకట కూడా ధాన్యం కొనుగోళ్లపై లక్ష్యాన్ని చూపేలా ఉంది. అటవీ శాఖ సహకారంతో కోతులు, అడవి పందుల బెడద తగ్గించే ప్రయమత్నాల్లో ఉన్నారు.  సబ్సిడీపై సోలార్‌ ఫెన్సింగ్‌ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.  వ్యవసాయ యాంత్రీకరణ జరిగితే తప్ప అనుకున్నది సాధించలేమని కూడా అన్నారు.  ఎక్కడ ఏ యంత్రాలు సమకూర్చాలో ప్రభుత్వం నిర్ణయించడంతో పాటు, అందరూ ఒకటే పంట వేస్తే అందరికీ నష్టం గనుక పంటలు ఎప్పుడెలా ఎక్కడ ఎలా వేయాలో కూడా నిర్ణయిస్తామని ప్రకటించారు. అధికారులు సూచించిన ప్రకారం పంటలు పండిస్తే రైతులకు లాభం చేకూరుతుంది. ప్రతి నియోజకవర్గానికి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం దూరదృష్టికి నిదర్శనంగా చెప్పుకోవాలి.  దుర్కొంటున్న సమస్యలనే సిఎం ప్రస్తావించడమే గాకుండా వాటిని ఎలా అధిగమించబోతున్నారో చెప్పారు. మార్కెట్‌ తెచ్చే ధాన్యంలో తేమ శాతం తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. పంటను ఒకేసారి మార్కెట్‌కు తరలించకుండా చూసుకోవాలి. ప్రతి గ్రామ రైతులకు ఒక నిర్ణీత రోజు, సమయం కేటాయించాలి. గిట్టుబాటు ధర రావాలంటే అది రైతుల చేతిలోనే ఉంది. నిమిషాల విూద కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం.  స్థానికంగా ఎక్కడ ఏ పంటలు పండుతాయో అక్కడ వాటికి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
తెలంగాణ రైతులను దేశంలోనే అత్యుత్తమ రైతులుగా తీర్చిదిద్దుతామని పసంకల్పాన్ని ప్రకటించారు.  మనం అనుకుంటే తెలంగాణలో బంగారు పంటలు పండవా? అఅన్న ఆలోచనతో రూ.12వేల కోట్లు రైతుల పెట్టుబడి కోసం వచ్చే బడ్జెట్‌లో కేటాయించారు.  మన రైతులు పండించే విలువ రూ.లక్షా 25వేల కోట్లు ఉండబోతోంది. కల్తీ విత్తనాలపై ఉక్కుపాదం మోపినట్లు వెల్లడించారు. సమన్వయ సమితి సరిగా ఉంటే కల్తీ చీడ పురుగులుండవు. రైతులకు కరెంట్‌, నీళ్లు, పెట్టుబడి, ఎరువులు, విత్తనాలు అన్ని ఇస్తున్నట్లు ప్రకటించారు.  రైతులు వ్యవస్థీకృతమే పంట కాలనీలు కూడా సాధ్యమే. రైతులంతా ఐక్యంగా ఉంటే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చన్నారు. ఇవన్నీ కూడా అమల్లోకి వచ్చేలా చేస్తున్న ప్రయత్నాలు చేయూతను అందించాలి. రైతులు బాగుపడేందుకు ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి అండగా నిలవాలి. రైతులు కూడా తమ భవిష్యత్‌ కోసం పంటలను వేయడం మొదలు, పురుగుమందులు వాడడం, అమ్మకాల వరకు తగుజాగ్రత్తలు పాటించాలి. ఈ రకమైన ఆలోచనలకు కేంద్రం కూడా అండగా ఉండాలి. అప్పుడే పథకాలు నేరుగా చేరుతాయి.

Other News

Comments are closed.