ఇంటింటి ప్రచారాలు..ర్యాలీలు 

share on facebook

అన్ని పార్టీలు ప్రాచరంలో జోరు

ప్రచారంలోకి దిగిన కుటుంబ సభ్యులు
ఆదిలాబాద్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రచారం జోరుగా సాగుతోంది. మరో నాలుగురోజులే గడువు ఉండడంతో ఇంటింటి ప్రాచరాం, ర్యాలీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అభ్యర్థుల కోసం కుటుంబ సభ్యుల కూడా ప్రచారంలోకి దిగారు. మిత్రులంతా సంగాల పేరిట ఒక్కటవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని నిర్మల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి సతీమణి కవిత అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో మాత్రమే అభివృద్ధి జరిగిందని, టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలను ఒరిగిందేవిూ లేదన్నారు. నిర్మల్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహేశ్వర్‌రెడ్డి విజయం ఎప్పుడో ఖాయమైందని కవిత ధీమా వ్యక్తం చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుండా మల్లేష్‌కు మద్దతుగా కూటమి నాయకులు ప్రచారంలో జోరుపెంచారు. భారీఎత్తున ద్విచక్రవాహన ర్యాలీని నిర్వహించారు. మహాకూటమిలోని కాంగ్రెస్‌, తెదేపా, భాకపా నాయకులు బెల్లంపల్లి పట్టణంలో రోడ్‌షోను నిర్వహించారు. తెరాస ప్రభుత్వం పాలనను అంతం చేయాలని గుండా మల్లేశ్‌ ఈ సందర్భంగా కోరారు. ప్రజలకు ఇచ్చిన హావిూలను కేసీఆర్‌ విస్మరించారని ఆరోపించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తు ప్రజాఉద్యమాలను లేకుండా చేశాడన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే బెల్లంపల్లిని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.  జిల్లాలో మరోసారి టీఆర్‌ఎస్‌దే హవా కొనసాగుతున్న దని,  మరోసారి గెలుపు బావుటా ఎగురవేయడం ఖాయమని టిఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో సబ్బండ వర్గాలు ఈ పార్టీపట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మెజార్టీ ఓటర్లతోపాటు మైనా ర్టీ ఓటర్లు కూడా గతంలోకంటే మరింత అధిక సంఖ్యలో టీఆర్‌ఎస్‌వైపు నిలుస్తున్నారని ధీమాగా ఉన్నారు. నేతలు  ఎక్కడ ప్రచారం నిర్వహించినా ప్రజలు భారీ సంఖ్యలో హాజరవుతున్నారు. ప్రజలు ఏ సమస్య కోసం వచ్చినా దానిని పరిష్కరించడంతోపాటు అందరినీ కలుపుకుపోయే నతేలు టిఆర్‌ఎస్‌లోఉన్నారని ప్రచారం చేస్తున్నారు. అన్ని మండలాల్లోని కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు  పెద్ద ఎత్తున టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడంతో పార్టీ బాగా పుంజుకున్నది. అంతేకాక, సీఎం బహిరంగ సభతో పార్టీ వర్గాలలో మరింత నూతనోత్సాహం నెలకొన్నది.

Other News

Comments are closed.