అభిమానులకు రజనీ దీపావళి శుభాకాంక్షలు

share on facebook

చెన్నై,నవంబర్‌6(జ‌నంసాక్షి): సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తన అభిమానులకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంటి బయట ఉన్న అభిమానులకి అభివాదం చేస్తూ ఈ దీపావళి అందరి జీవితాలలో వెలుగు నింపాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. రజనీకాంత్‌ నటించిన భారీ బడ్జెట్‌ చిత్రం 2.0 నవంబర్‌ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ప్రస్తుతం తన 165వ చిత్రం పేటా చిత్రంతో బిజీగా ఉన్న రజనీకాంత్‌ ఇటీవల వారణాసి షెడ్యూల్‌ పూర్తి చేసుకొని మరో షెడ్యూల్‌ కోసం సిద్ధమయ్యారు. రజనీ నటిస్తున్న పేటా సినిమాని కార్తీక్‌ సుబ్బరాజు తెరకెక్కిస్తుండగా ఈ చిత్రంలో సిమ్రాన్‌, త్రిష, విజయ్‌ సేతుపతి, బాబీ సింహా, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, మేఘా ఆకాష్‌, సతన్‌రెడ్డి, మాళవికా మోహనన్‌లతో పాటు డైరెక్టర్లు మహేంద్రన్‌, శశికుమార్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని, రజనీకాంత్‌ క్యారెక్టర్‌లో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయని టాక్‌. అనిరుద్‌ రవిచంద్రన్‌ సంగీతం అందించిన ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు.

 

 

 

Other News

Comments are closed.