అభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శం

share on facebook

పనిచేసే వారికే ఎన్నికల్లో ప్రాధాన్యం
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
జనగామ,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో జరుగుచున్న అభివృద్ధి పనులు దేశంలో ఎక్కడా అమలు కావడంలేదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. రైతు బంధు, రైతుబీమా లాంటి పథకాలను దేశంలోని ఇతర రాష్ట్రాల్లో  కాపీ కొడుతున్నారని గుర్తుచేశారు. ప్రధాని మోడీ సైతం రైతుబంధును కాపీ కొట్టి దేశమంతటా ఐదు ఎకరాలలోపు భూములు ఉన్న రైతులకు సంవత్సరానికి రూ.ఆరు వేల పథకాన్ని తెచ్చారని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతీ
ఊరుచెరువు గోదావరి నీళ్లతో కళకళాలాడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. వచ్చే ఎంపి ఫలితాల తరవాత ఢిల్లీలో కెసిఆర్‌ కీలకం కానున్నారని అన్నారు. ఇకపోతే ప్రాదేశిక ఎన్‌ఇనకల్లో సత్తా చాటాలని అన్నారు.  గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ అనునిత్యం పనిచేసేవారికే త్వరలో జరగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో ప్రధాన్యత ఉంటుందని  అన్నారు. గ్రామాల్లో స్వచ్ఛతెలంగాణలో పాల్గొంటూ గ్రావిూణ ప్రజల అవసరాలు తీరుస్తూ, వారిసమస్యలు పరిష్కరించే స్థానికులకు ఎంపీటీసీగా, జెడ్పీటీసీలు, ఎంపీపీలుగా, జెడ్పీచైర్‌పర్సన్లుగా పార్టీ నుంచి అదరణ ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా పైరవీలు చేసేవారికి స్థానం ఉండదని హెచ్చరించారు. దీనికి తెలంగాణ ప్రజలు తెలంగాణాలోని అన్ని స్థానాలు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలింపించి కానుకగా అందించాలని ఆయన సూచించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేలకు అప్పగించడంతో జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగురవేసేందుకు శ్రీకారం చుడుతున్నారు. ఈ మేరకు గులాబీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు  జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పార్టీ ముఖ్య కార్యకర్తలు, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ ఆశావహులతో ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహించారు. జిల్లాలో ఏ ఎన్నికలు జరిగినా భారీ విజయాన్ని నమోదు చేసుకుంటున్న టీఆర్‌ఎస్‌ త్వరలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ క్లీన్‌స్వీప్‌ చేస్తుందని అన్నారు.  జిల్లాలో 12 జెడ్పీటీసీ, 12 ఎంపీపీ, 140 ఎంపీటీసీ పదవులను కైవసం చేసుకుంటా మని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పంచాయతీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు తమ వైపే ఉన్నారని నిరూపించుకుని మంచి ఊపువిూదున్న గులాబీ పార్టీ అన్ని ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను క్లీన్‌స్వీప్‌ చేసి జెడ్పీపీఠం కైవసం చేసుకుంటామని అన్నారు.

Other News

Comments are closed.