అభివృద్ధి చేశాం..ఆశీర్వదించండి..

share on facebook

కొప్పుల ఈశ్వర్‌

వెల్గటూర్‌, నవంబర్‌ 18, (జనం సాక్షి): గడిచిన నాలుగున్నరేళ్లలో అభివృద్ధి చేశాం. రానున్న ఎన్నికలల్లో ఆశ్వీరదించి మళ్లీ గెలిపించాలని ధర్మపురి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ కోరారు. ఆదివారం వెల్గటూర్‌ మండలంలోని స్థంభంపల్లి, వెంకటాపూర్‌ పాషిగామ గ్రామాలలో కొప్పుల ఈశ్వర్‌ ఎంపీపీ పోనుగోటి శ్రీనివాసరావుతో కలిసి ఇంటింటా తిరిగి ప్రచారం చేశారు. ఈ సందర్బంగా కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ని రానున్న ఎన్నికల్లో ఆశ్వీరదించి గెలిపించి మరింత అబివఅద్దికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో వెల్గటూర్‌, ధర్మపురి మాజీ ఏఎంసీ చైర్మన్‌లు ముల్కల్ల గంగరాం, అల్లం దేవమ్మ, కోటిలింగాల ఆలయ మాజీ చైర్మన్‌ నారాయణ రావు, మండల వైస్‌ ఎంపీపీ రంగు సత్యం గౌడ్‌, కేడీసీసీ బ్యాంక్‌ డైరెక్టరు పోనుగోటి రాం మోహన్‌ రావు, మాజీ సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గన్నారు.

 

 

Other News

Comments are closed.