అమరవీరుల పేరుతో ప్రజలకు అన్యాయం: డిసిసి

share on facebook

నిజామాబాద్‌,జూలై10(జ‌నం సాక్షి): అమరవీరుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో రైతులను ఆదుకోకుండా అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బీన్‌ హందాన్‌ అన్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో జిల్లాలో ముందుకు వెళ్లేందుకు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ పునఃనిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు తనవంతు కృషిచేస్తానని అన్నారు. రాష్ట్రంలో కుటుంబపాలన జరుగుతోందని గుర్తు చేశారు. బూత్‌ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రంగం సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఎవరికి అన్యాయం జరిగిందని అడిగితే రైతులకు అన్యాయం జరిగిందని స్పష్టంగాచెప్పవచ్చన్నారు. పథకాలు పేరు చెప్పడం తప్ప వీటివల్ల ప్రజలకు ఎక్కడా లాభం జరిగింది లేదన్నారు. రైతులకు మద్దతు ధరలు మాత్రం ఇవ్వడం లేదన్నారు. పసుపుబోర్డు ఏర్పడలేదని, నిజాం షుగర్స్‌కు విముక్తి లభించలేదన్నారు.

 

Other News

Comments are closed.