అమెరికాలో కామారెడ్డి వాసి మృతి

share on facebook

సొంతూరు ఆరెపల్లిలో విషాదం
కామారెడ్డి,మే14(జ‌నం సాక్షి): కామారెడ్డి జిల్లా వాసి ఒకరు  అమెరికాలో మృతి చెందాడు. మాచారెడ్డి మండలం ఆరెపల్లికి చెందిన వెలమ వెంకట్రామిరెడ్డి(40) డల్లాస్‌లో గ్లోబల్‌ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. వెంకట్రామిరెడ్డి భార్య వాణి కూడా ఉద్యోగినే. తన స్నేహితులతో కలిసి వెంకట్రామిరెడ్డి బోటు షికారుకు వెళ్లాడు. దీంతో బోటు బోల్తాపడి  నీటిలో మునిగి పోయారు. మృతదేహాలను నది నుంచి బయటకు వెలికితీశారు డల్లాస్‌ పోలీసులు. వీరి మృతిపై డల్లాస్‌ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. వెంకట్రామిరెడ్డి మృతితో ఆరెపల్లిలో విషాదం నెలకొంది. వారం రోజుల్లో వెంకట్రామిరెడ్డి మృతదేహం స్వగ్రామానికి రానుంది.

Other News

Comments are closed.