అర్హులకు సాగు భూమి పంపిణీ: ఎంపి

share on facebook

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): అర్హులైన గిరిజన కుటుంబాలకు సాగు భూమి ఇవ్వడానికి  ఉమ్మడి జిల్లాలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఎంపీ జి.నగేశ్‌ తెలిపారు.  వాస్తవానికి మొదట చెంచుల కోసమే ప్రభుత్వాలు భూములు ఇచ్చాయని ఇప్పుడు టీఆర్‌ఎస్‌ సర్కాలు అర్హులైన గోండు, కోలాం, నాయక్‌పోడ్‌, తోటి తదితర గిరిజనులకు భూమి ఇవ్వబోతున్నదని అన్నారు. సీఎం కేసీఆర్‌ భవిష్యత్తు ఆలోచనతో అమలు చేస్తున్న డబుల్‌బెడ్‌ రూం ఇండ్లు దేశంలోనే సాహసమైన పథకమని ఎంపీ అభివర్ణించారు. ఒక్కో ఇంటికి రూ.5.30 లక్షలు ఖర్చు చేస్తుందన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పనులు త్వరలో ఎప్రారంభిస్తారని తెలిపారు. జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరిస్తామని  అన్నారు. ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని  సూచించారు.  సీఎం కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శమని పేర్కొన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. గిరిజన, బలహీన వర్గాలకు చదువు ఆవశ్యకత ఇంకా ఉందని అన్నారు.

Other News

Comments are closed.