అల్పాజ్రోలం మత్తు టాబ్లెట్ల స్వాధీనం

share on facebook

హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): నగరంలో 8059 మత్తు టాబ్లెట్స్‌ను పట్టుకున్నట్లు ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ ఖురేషి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… అల్పాజ్రోలం అనే మత్తు టాబ్లెట్లను స్వాధీనం చేసుకుని రాజేశ్‌ అనే వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. కాగా… బెంగళూరు నుంచి ఈ టాబ్లెట్లను తీసుకువచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు, ఆటోడ్రైవర్లు, రోజువారీ కూలీలే టార్గెట్‌గా ఈ టాబ్లెట్లను విక్రయిస్తున్నట్లు ఖురేషి తెలిపారు.

 

Other News

Comments are closed.