అవినీతికి పాల్పడిన వీఆర్‌ఓను సస్పెండ్‌ చేసిన సిద్దిపెట కలెక్టర్‌

share on facebook

-మంత్రి ఈటెల ఆదేశంతో స్పందించిన కలెక్టర్‌

-దళిత యువకుల ఆత్మహత్యాయత్నానికి కారణమైన వీఆర్‌ఓ

సిద్దిపేట, సెప్టెంబర్‌ 4 (జ‌నంసాక్షి):గణెళిష్‌ నిమజ్జనం రోజు సంచలనం కలిగించిన దళితయువకుల ఆత్మహత్యా యత్నానికి కారణంగా బావిస్తూ పాత కరీంనగర్‌ జిల్లాలోని మానకొండూర్‌ నియోజకవర్గంలోని బెజ్జంకి మండలం కల్లెపల్లి మదిర గ్రామమైన గూడెం వీఆర్‌ఓ రవిని సస్పెండ్‌ చేస్తూ సిద్దిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడెకరాల భూపంపిణీ కార్యక్రమంలో వీఆర్‌ఓ రవి ఆత్మ హత్యా యత్నానికి పాల్పడిన వ్యక్తులనుంచి 40వేలు లంచం ఇస్తేనే

భూమి కేటాయిస్తామని చెప్పడంతో ఆందోలనకు గురైన యువకులు పరశురాములు, మరోవ్యక్తి మంత్రిఈటెల రాజేందర్‌కు స్వయంగాచెప్పడంతో వెంటనే స్పందించిన మంత్రి కలెక్టర్‌ను వీఆర్‌ఓను సస్పెం డ్‌ చేయాలని ఆదేశించడంతో వెంటనే రాత్రికి రాత్రే వీఆర్‌ రవిని సస్పెండ్‌ చేసి సంఘటనపై జాయింట్‌ కలెక్టర్‌ పద్మాకర్‌ను విచారణ జరపాలని కలెక్టర్‌ ఆదేశించారు. జాయింట్‌ కలెక్టర్‌ నివేదిక రాగానే శాశ్వత చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి తెలిపారు.

Other News

Comments are closed.