అవిశ్వాసంపై చర్చలో మోడీ ప్రభుత్వాన్ని టీఆర్‌ఎస్ పార్టీ ఎండగట్టింది.

share on facebook

హైదరాబాద్(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం, టీఆర్‌ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలను కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ తిప్పికొట్టారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నది కాంగ్రెస్ పార్టీనేనని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో వినోద్ మాట్లాడుతూ.. లోక్‌సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా 23 నిమిషాలు మాట్లాడాం. ప్రజల ఆశలకు అనుగుణంగా మోదీ ప్రభుత్వం పనిచేయడం లేదని చెప్పాము. పోలవరం ప్రాజెక్టుకు నిధులిస్తామని విభజన చట్టంలో చెప్పిన కేంద్రం.. తెలంగాణలోని ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదు. దీనికి బాధ్యత కాంగ్రెస్ పార్టీది కాదా..? ఉత్తమ్‌కుమార్ చెప్పేవన్నీ అసత్యాలే. కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతలకు కావాల్సిన అనుమతులన్నీ సాధించాం. అవిశ్వాసంపై చర్చలో మోడీ ప్రభుత్వాన్ని టీఆర్‌ఎస్ పార్టీ ఎండగట్టింది.

రాయితీలు ఇస్తే రాష్ట్రం పరిస్థితి ఏంటీ?

తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలపడం రాజ్యాంగ విరుద్దమని చెప్పాం. తెలంగాణ అప్పులకు కారణం కాంగ్రెస్ పార్టీనే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పన్ను రాయితీలని ఏపీకీ హామీలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పన్ను రాయితీలు ఇస్తే రాష్ట్రం పరిస్థితి ఏంటీ?. రాష్ర్టానికి తీవ్ర అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనే. టీడీపీకి మద్దతు ఇవ్వాలని ఉత్తమ్ కోరడం అవివేకం . జాతీయ ప్రాజెక్టు ఇవ్వకపోవడమే కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు. నీళ్లున్న రాష్ట్రం ఏపీలోని పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు.

ఉత్తమ్ చేసిన విమర్శలకు అర్థం లేదు.

నీళ్లు లేని తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్టు ఇవ్వలేదు. బ్యాంకుల దగ్గర అప్పులు తెచ్చి ప్రాజెక్టులు కడుతున్నాం. చట్ట ప్రకారం కావాల్సిన అన్ని అనుమతులు తీసుకున్నాం కాబట్టే.. బ్యాంకులు, సంస్థలు అప్పులు ఇస్తున్నాయి. ప్రభుత్వంపై ఉత్తమ్ చేసిన విమర్శలకు అర్థం లేదు. తెలంగాణపై ఈగ వాలినా ఊరుకోం. తెలంగాణ ప్రజల కోసమే టీఆర్‌ఎస్ పార్టీ పుట్టింది. నీళ్లు ఉరకనీయం..నడవనిస్తాం అని సీఎం అన్నారని గుర్తుచేశారు. తెలంగాణకు అన్యాయాన్ని ఎదిరించడమే మా లైన్. మోడీ ప్రభుత్వానికి జనామోదం లేదు. పార్లమెంట్‌లో బీజేపీ పాలనపై నిరసన తెలిపామని వివరించారు.

Other News

Comments are closed.