అసెంబ్లీ ఎదుట జంట ఆత్మహత్యాయత్నం

share on facebook

లక్నో,జూన్‌13(జ‌నం సాక్షి ): ఉత్తరప్రదేశ్‌లోని విధాన సభ ఎదుట ఓ జంట ఆత్మహత్యకు యత్నించడం కలకలం సృష్టించింది. సమాజ్‌వాది కార్యకర్తపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఆ దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. పక్కనే ఉన్న పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై బాధితురాలి భార్త మాట్లాడుతూ.. 2015లో తన భార్యపై సమాజ్‌వాది పార్టీ కార్యకర్త ఒకరు అత్యాచారానికి పాల్పడ్డాడని, పోలీసులు గానీ, ప్రభుత్వం గానీ ఇప్పటి వరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించాడు. పైగా కేసును వాపసు తీసుకోవాలని, లేదంటే చంపేస్తానంటూ నిందితుడు బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం జరగదని భావించి విధానసభ ముందు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. నిందితుడిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

 

Other News

Comments are closed.