*అసెంబ్లీ బడ్జెట్  సమావేశాలలో 5 పంచాయతీలను తెలంగాణలో కలపాలని తీర్మానం చేయాలి.

share on facebook
*భద్రాద్రి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయింపు చేయాలి.
*కెసిఆర్ ఇచ్చిన 100 కోట్ల హామీని అమలు చేయాలి.
*భద్రాచలం మున్సిపాలిటీ నా? పంచాయతీ నా? రాష్ట్రప్రభుత్వం తేల్చాలి.
*పోలవరం బ్యాక్ వాటర్ తో భద్రాచలం ముంపు ప్రమాదం పై ఇంజనీరింగ్ నిపుణులతో సర్వే చేయించాలి.
*ముఖ్యమంత్రి హామీ మేరకు జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలి.
*మాజీ ఎంపీ, సిపిఎం రాష్ట్ర నాయకులు డాక్టర్ మీడియం బాబు డిమాండ్.
ఫోటో రైట్ అప్ : 2. సమావేశంలో మాట్లాడుతున్న మీరేం బాబురావు.
భద్రాచలం, మార్చి 6 (జనం సాక్షి): రేపటి నుంచి జరగనున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భద్రాచలం కు ఆనుకుని ఉన్న ఐదు గ్రామ పంచాయితీలను తెలంగాణలో కలపాలని తీర్మానం చేయాలని, భద్రాచలం పట్టణ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయింపు చేయాలని సిపిఎం భద్రాచలం మాజీ ఎంపీ సిపిఎం రాష్ట్ర నాయకులు డాక్టర్ మీడియం బాబురావు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం పట్టణ కమిటీ, శాఖ కార్యదర్శుల సంయుక్త సమావేశం పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన జిల్లా విభజనలో తీవ్రంగా నష్టపోయిన భద్రాచలం అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడి రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఐదు పంచాయతీల పై  తీర్మానం చేయాలని, భద్రాచలం అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడేండ్ల క్రితం ఇచ్చిన 100 కోట్ల హామీని అమలు చేయాలని అన్నారు. భద్రాచలం గ్రామపంచాయతీ నా మున్సిపాలిటీ నా తేల్చి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో భద్రాచలం పట్టణానికి పొంచి ఉన్న ముంపు ప్రమాదంపై ఇంజనీరింగ్ నిపుణులతో సర్వే చేయించి ముంపు పై ఒక స్పష్టత ఇవ్వాలని కోరారు. భద్రాచలం పట్టణ అభివృద్ధి కోసం సిపిఎం ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించడం జరిగిందని, ఇటీవల కాలంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో భద్రాచలం బంద్ తో పాటు సరిహద్దుల దిగ్బంధనం నిర్వహించడం జరిగిందని, ప్రజల ఆందోళన పోరాటాలను గమనంలో ఉంచుకొని రానున్న బడ్జెట్ సమావేశాలలో భద్రాచలం పట్టణ అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలోని అధికార  టిఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలు  భద్రాచలం సమస్యలపై నోరు విప్పాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి హామీ మేరకు జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎం రేణుక పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు, వై వెంకటరామారావు, నాదెళ్ల లీలావతి, పి.సంతోష్ కుమార్, డి.సీతాలక్ష్మి యూ.జ్యోతి, జి.జ్యోతి, ఎన్. నాగరాజు, జి.లక్ష్మణ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.