ఆందోళనల నడుమ పద్మావత్‌ సినిమా విడుదల

share on facebook

– నాలుగు రాష్టాల్ల్రో పడని పద్మావత్‌ షోలు
– మిగిలిన రాష్టాల్ల్రో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు
– సుప్రీంలో నాలుగు ప్రభుత్వాలపై కోర్టు ధిక్కారం పిటీషన్‌ దాఖలు
– విచారణకు స్వీకరించిన కోర్టు.. సోమవారానికి వాయిదా
– యూ సర్టిఫికెట్‌తో పాక్‌లో విడుదలైన సినిమా
న్యూఢిల్లీ, జనవరి25(జ‌నంసాక్షి): కర్ణిసేన ఆందోళనలు, హింసాత్మక  ఘటనల మధ్యనే పద్మావత్‌ సినిమా విడుదలైంది. ఈ సినిమాను ముందు నుంచి వ్యతిరేకిస్తున్న రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హర్యానా రాష్టాల్లో
మినహా మిగిలిన రాష్టాల్ల్రో సినమాను విడుదల చేశారు. మరోవైపు సినిమా విడుదల అవుతున్న థియేటర్ల దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఉత్తరప్రదేశ్‌ లోని వారణాసి, లక్నో, కాన్పూర్‌ లో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.  ఇదిలా ఉంటే  తెలుగు రాష్టాల్రలో ‘పద్మావత్‌’ చిత్రం భారీగానే విడుదలైంది. సుమారు 400పైగా థియేటర్లలో రిలీజైంది. తెలుగు రాష్టాల్లో హిందీ, తెలుగు  భాషల్లో ‘పద్మావత్‌’ ప్రదర్శితమవుతోంది. తెలంగాణలో మంగళవారం  ప్రీమియర్‌ షోలు పడటంతో ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది.  ఒక పక్క సుప్రీంకోర్టు ఉత్తర్వులు, మరోపక్క కొన్ని రాష్టాల్ల్రో  ఆందోళనల మధ్య పద్మావత్‌ చిత్రం గురువారం దేశవ్యాప్తంగా సుమారు ఏడువేల థియేటర్లల్లో విడుదలైంది. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గోవా రాష్టాల్ల్రో  మాత్రం ఆందోళనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిలిపివేశారు. ఈ చిత్రం విడుదలైన థియేటర్ల వద్ద పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని దిల్షాద్‌ గార్డెన్‌ వద్ద కొంతమంది ఆందోళనకారులు స్కూలు బస్సును అడ్డుకున్నారు. కర్ణిసేన సభ్యులు మధ్యప్రదేశ్‌లోని ఒక కారుకు నిప్పంటించారు. అయితే అది కర్నినేత సురేంద్ర సింగ్‌ కారు కావడంతో ఆందోళనకారులు అవాక్కయ్యారు. సింగ్‌ పక్క వీధిలో పార్క్‌ చేసి ఆందోళన చేసేందుకు వెళ్లగా, అక్కడికెళ్లిన ఆందోళన కారులు ఆ కారు సింగ్‌దని తెలియక తగులబెట్టేశారు. పద్మావత్‌ విడుదలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన కర్ణిసేన చిత్తోడ్‌గఢ్‌ జిల్లా అధ్యక్షుడు గోవింద్‌ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దర్శకుడు సంజయల్‌ లీలా బన్సాలీని వ్యతిరేకిస్తూ, రాణి పద్మావతికి మద్దతు పలుకుతూ కర్ణిసేన సభ్యులు ఢిల్లీ-జైపూర్‌ హైవేను నిర్బంధించారు. బుధవారం గుర్‌గావ్‌లో ఆందోళనల నేపథ్యంలో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అలాగే కర్నిసేన దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఉదరుపూర్‌ ఎడిఎం ఎస్పీ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘ఘూమర్‌’ డాన్స్‌ చేయకూడదని ఆదేశాలు జారీచేశారు. ఇదిలావుండగా పద్మావత్‌ చిత్రాన్ని అడ్డుకోవడం కోర్టు ధిక్కారణ
అవుతుందని పేర్కొంటూ ఒక న్యాయవాది గురువారం సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు.
పాకిస్థాన్‌లో పద్మావత్‌కు గ్రీన్‌సిగ్నల్‌..
సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన పద్మావత్‌ మూవీపై ఓవైపు ఇండియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ దేశవ్యాప్తంగా సినిమా రిలీజైనా.. హింస ఎక్కువగా ఉన్న ఆ నాలుగు రాష్టాల్ల్రో మాత్రం సినిమాకు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. మరోవైపు పాకిస్థాన్‌లో మాత్రం ఈ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించడం గమనార్హం. అక్కడి సీబీఎఫ్‌సీ సినిమా రిలీజ్‌కు క్లియరెన్స్‌ ఇచ్చినట్లు సెన్సార్‌ బోర్డ్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఎలాంటి అభ్యంతరాలు తెలపకుండా సినిమా రిలీజ్‌కు అనుమతి ఇచ్చినట్లు సీబీఎఫ్‌సీ సభ్యుడు మొబషిర్‌ హసన్‌ తెలిపారు. అంతేకాదు ఈ సినిమాకు క్లీన్‌ యు సర్టిఫికెట్‌ ఇవ్వడం విశేషం. అల్లావుద్దీన్‌ ఖిల్జీని విలన్‌గా చూపించారంటూ పాకిస్థాన్‌లో చాలా మంది మూవీని వ్యతిరేకించారు. అయితే కళలు, సృజనాత్మకత, వినోదం విషయంలో సీబీఎఫ్‌సీ ఎలాంటి వివక్ష చూపబోదని హసన్‌ స్పష్టంచేశారు. పూర్తి నిబంధనల ప్రకారమే ఈ సినిమాకు క్లియరెన్స్‌ ఇచ్చినట్లు చెప్పారు. దీనికోసం ఖ్వాయిదె ఆజం యూనివర్సిటీకి చెందిన చరిత్రకారుడు, ప్రొఫెసర్‌ వకార్‌ అలీ షా సాయం తీసుకున్నట్లు హసన్‌ తెలిపారు. ఓటింగ్‌లో ఆయనకు ఎలాంటి హక్కు లేకపోయినా.. ఆయన అభిప్రాయం మేరకు సినిమాకు క్లియరెన్స్‌ ఇచ్చినట్లు చెప్పారు.
సుప్రీంలో కోర్టుధిక్కారం కింద పిటీషన్‌ దాఖలు..
‘పద్మావత్‌’ సినిమాకు వ్యతిరేకంగా రాజ్‌పుత్‌ కర్ణిసేన ఆందోళనలు ¬రెత్తుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. కర్ణిసేనతోపాటు ఈ సినిమాను విడుదల చేయని నాలుగు రాష్టాల్ర ప్రభుత్వాలపై కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. పద్మావత్‌ సినిమా విడుదలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. కర్ణిసేన తీవ్రంగా ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో రాజ్‌పుత్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గోవా, గుజరాత్‌ రాష్టాల్ల్రో  ‘పద్మావత్‌’ సినిమా విడుదల నిలిచిపోయింది. మరోవైపు పలు రాష్టాల్లో కర్ణిసేన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కొన్నిచోట్ల ఆందోళనకారులు దుకాణాలపై దాడులకు దిగి విధ్వంసాలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసు కుంటున్నాయి. ఈ నేపథ్యంలో శాంతిభద్రతలు కాపాడటంలో ఈ రాష్టాల్రు విఫలమయ్యాయని, కాబట్టి ఆ నాలుగు రాష్టాల్రపై, కర్ణిసేనపై కోర్టు ఉల్లంఘన చర్యలు తీసుకోవాలని పిటిషనర్‌ ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా.. కేసు తీవ్రతనుబట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై సోమవారం న్యాయస్థానం విచారణ చేపట్టనుంది.

Other News

Comments are closed.