ఆందోళన కలిగిస్తున్న వర్షాభావ పరిస్థితులు

తీవ్ర వర్షాభావ పరిస్థితులు మళ్లీ రైతాంగాన్నికుదేలు చేస్తున్నాయి. ఆశాజనకంగా ఉంటుందనుకుంటున్న తరుణంలో మళ్లీ ఎండల ప్రభావంపెరుగుతోంది. దీంతో ప్రధానంగా తెలుగు రాష్టా ప్రజలు మళ్లీ కుదేలవుతున్నారు. రైతుఉల ఆందోళన చెందుతున్నారు. అడపాదడపా కురిసన వర్షాలకు వేసిన పైర్లు ఎండిపోతున్నాయి. ఇరు రాష్టాల్ల్రో నాటిన మొక్కలు వాడి ఎండిపోతున్నాయి. నీళ్లు లేక వాటి ఆలనా పాలనా చూసే దిక్కు లేకుండా పోయింది. గోదావరి, కసృ/-ణమ్మలకు పెద్దగా వరదలు రాలేదు. దీంతో మల్లీ పంటలు లేకుంటే ధరలు మండడం ఖాయమని మరోవైపు సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఇకపోతే ఆయా గ్రామాల్లో ఇంకా సమ్మర్‌ వేడినుంచి తేరుకోని పరిస్థితులు ఉన్నాయి. దీనికితోడు మంచినీటి సమస్యా వెన్నాడుతోంది. కరువు రక్కసి ఈ ఖరీఫ్‌ను సైతం కబళించేందుకు కోరలు సాచిందని ప్రభుత్వ వర్షపాతం లెక్కలే తెలుపుతున్నాయి. సీజనులో జూలై, ఆగస్టు మాసాలు అత్యంత కీలకమైనవి. తొలకరి వానలకు రైతులు వేసిన పంటలు ఏపుగా ఎదిగే కాలం ఇదే. పూత, పిందె దశలో నీరు తప్పనిసరి. సరిగ్గా ఇప్పుడే రుతుపవనాలు మొరాయించి వానలు ముఖం చాటేశాయి. నైరుతి రుతుపవనాలు ఈ ఏట అనుకున్నదానికంటే కాస్త ఆలస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ జూన్‌లో దాదాపు అన్ని జిల్లాల్లోనూ మంచి వర్షాలే కురిశాయి. ఎపిలో సగటున ఆ నెలలో కురవాల్సిన దాని కంటే 65 శాతం అధిక వర్షం కురిసింది. కాగా జూలై రెండో వారం నుంచి వర్షాభావ సమస్య మొదలైంది. వరుస విపత్తులతో కుదేలైన రైతాంగంలో ఈ తడవ కరువు తీరా వానలు పడతాయని సీజను మొదట్లో వాతావరణ శాఖ మోసుకొచ్చిన చల్లని కబురు ఆశలు చిగురింపజేయగా అంతలోనే తీవ్ర వర్షాభావంవారి ఆశలపై నీళ్లు చల్లడం ఆందోళన కలిగిస్తోంది.  సాధారణ వర్షంలో 59 శాతం లోటు ఏర్పడింది. మూడవ వారంలో 49 శాతం, నాల్గవ వారంలో 33 శాతం మేర లోటు కొనసాగింది. దాదాపు 25 రోజుల పాటు చాలా ప్రాంతాల్లో అనావృష్టి పాగా వేసింది. జూలై చివరిలో అల్పపీడనం వలన వర్షాలు పడటంతో ఆ నెలలో లోటు 19 శాతం వద్ద స్థిరపడింది. పర్వాలేదనుకోగా ఆగస్టులో మరోసారి వర్షాభావం తీవ్ర రూపం దాల్చింది. ఈ నెల 18 నాటికి ఆగస్టులో వర్షపులోటు ఆందోళనకరంగా 80 శాతానికి ఎగబాకింది.

తొలకరి వర్షాలకు మిగులు వర్షపాతం నమోదైన జిల్లాలు, మండలాలు క్రమేపి దుర్భిక్షం కౌగిట్లోకి చేరుతున్నాయి. ప్రస్తుత వర్షాభావాన్ని ఏం పట్టించుకుంటుందన్న ధోరణిలో ప్రజలు నిస్పహతో ఉన్నారు.  నిరుడు కరువు మండలాల గుర్తింపులో విన్యాసాలు చేసింది. కరువు మండలాలను ప్రకటించి చేతులు దులుపుకుంది. రుణ మాఫీ తెచ్చిపెట్టిన గందరగోళంతో కరువు మండలాలు ప్రకటించినా రైతుల రుణాలు రీషెడ్యూల్‌ కాలేదు. కొత్త అప్పు పుట్టలేదు. సంకీర్ణ ప్రభుత్వంలో భాగం పంచుకొని కూడా కేంద్రం నుంచి విపత్తు నిధులు తెచ్చిందీ లేదు. ప్రభుత్వం ప్రాతః కాలపు ధోరణిని విడిచిపెట్టి రాష్టాన్ని చుట్టుముడుతున్న అనావృష్టిపై అప్రమత్తం కావాలి. రైతులను, వ్యవసాయ కూలీలను యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలి. తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. పరిహారం బకాయిలను తక్షణం చెల్లించాలి.అనేక జిల్లాలు ఇప్పటికే వర్షాభావం కారణంగా తీవ్ర దుర్భిక్షం వలలో చిక్కకుకున్నాయి.  అనేకమండలాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రాబోయే రోజుల్లో ఇంకెన్ని మండలాల్లో పరిస్థితులు విషమిస్తాయోనన్న భయం సర్వత్రా నెలకొంది. ఎంతో ఆశతో ఆరుగాలం శ్రమించి పంటలేసిన అన్నదాతకు పైర్లు కాపాడుకోడానికి భగీరథకు మించిన కఠోర కష్టం చేయాల్సి వస్తున్నది. కొన్ని కిలోవిూటర్ల నుంచి నీటిని తీసుకొచ్చి పంటలను తడుపుకోవాల్సిన దుస్థితి. కరువు ఇంతగా పంజా విసిరినా చంద్రబాబు సర్కారుకు చీమ కుట్టినట్టయినా లేదు. అధికార యంత్రాంగాన్ని కదిలించే స్థాయిలో సవిూక్ష సైతం లేదు. ఇప్పటినుంచే కరువు నివారణా చర్యలకు ఉపక్రమించాల్సి ఉంది. వర్షాభావంపై చర్యల విషయంలో విూనమేషాలు లెక్కించడం తగదు. పుష్కరాలకు వెళ్లిన భక్తులు ఎండలు తాళలేకపోతున్నారు. దీనిని బట్టి వాతావవరణం అర్థం చేసుకోవచ్చు.

మరోవైపు విజయవాడతో సహా దక్షిణ కోస్తాపై ఎండలు నిప్పులు కక్కుతున్నాయి. రోహిణి  కార్తెను తలపించేలా సాధారణం కంటే ఐదారు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా ఒంగోలులో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కావలి, మచిలీపట్నం, నెల్లూరుల్లో 39, తుని, విజయవాడ, బాపట్ల, తిరుపతిల్లో 38, కాకినాడ, రెంటచింతలలో 37, నర్సాపురం, అనంతపురాల్లో 36 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతున్నా అవి సెగలను తగ్గించలేకపోతున్నాయి. ప్రస్తుతం ఉత్తర, వాయవ్య బంగాళాఖాతాల్లోనే ఇవి ఏర్పడుతుండటంతో, అవేవిూ మన రాష్ట్రంపై ప్రభావం చూపడం లేదు. ఫలితంగా రాష్ట్రంలో అసాధారణ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. వేసవిలో సాధారణం కంటే ఆరు డిగ్రీలు అధికంగా నమోదయితే వడగాడ్పుల హెచ్చరికలు జారీ చేస్తారు. ప్రస్తుతంఆ పరిస్థితే ఉండటం గమనార్హం. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ ఉష్ణతీవ్రత అధికంగా ఉంది. వరంగల్‌, పాలమూరుల్లో కూడా ఇదే పరిస్థితి. దీంతో మల్లీ ఎండాకాలం వచ్చిందన్న రీతిలో ఉంది. ఈ పరిస్థితులపై ప్రభుత్వాలు అధ్యయనం చేసి తద్వారా వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి సిద్దం కావాలి.