ఆకస్మికంగా పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన

share on facebook
ఎస్పీ రోహిణి ప్రియదర్శిని

టేక్మాల్ జనం సాక్షి ఆగస్టు 17 టేక్మాల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. టేక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు పోలీస్ స్టేషన్ లో కేసుల రికార్డును ఆమె పరిశీలించారు సిబ్బంది పనితీరును ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితులకు న్యాయం జరిగే విధంగా మర్యాదగా ప్రవర్తించాలని ఆమె సూచించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి వ్యక్తిగత సమాచారం అడిగితే ఎవరు ఇవ్వవద్దని సూచించారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో అల్లాదుర్గం సీఐ జార్జ్, ఎస్సై లింగం, హెడ్ కానిస్టేబుల్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు

 

Other News

Comments are closed.