ఆజాద్‌ స్పూర్తి ఎంతో గొప్పది

share on facebook

-జాయింట్‌ కలెక్టర్‌ పద్మాకర్‌
సిద్దిపేట,నవంబర్‌11(జ‌నంసాక్షి): స్వాతంత్య్ర సమరయోధుడిగా పాత్రికేయుడిగా మౌలానా ఆజాద్‌ కనబర్చిన జాతీయ స్పూర్తి ఎంతో గొప్పదని జాయింట్‌ కలెక్టర్‌ పద్మాకర్‌ పేర్కొన్నారు. స్వాతంత్య్ర భారత తోలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి సందర్బంగా శనివారం సవిూకృత కలెక్టర్‌ కార్యాలయం సమావేశ మందిరంలో ఆజాద్‌ చిత్రపటానికి ఆయన పూలమాలవేసి నివాళులర్పించారు. మౌలానా జయంతి అయిన నవంబర్‌ 11న నేషనల్‌ ఎడ్యుకేషన్‌ డేగా జరుపుకుంటున్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకునే అవకాశం చిక్కడం అదృష్టమన్నారు. ఆమహానుభావుడి ఆదర్శాలను నేటి సమాజం అంతా అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, కలెక్టరేట్‌ ఎఓ శ్రీణివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.