ఆజాన్‌లో ఆరేండ్ల బాలికపై లైంగికదాడి..

share on facebook

మెహిదీపట్నం : నగరంలోని టోలీచౌకి కులీకుతుబ్‌షా సెవెన్‌టూంబ్స్ రోడ్డులో ఉన్న ఆజాన్ ఇంటర్నేషనల్ స్కూల్ వివాదాలకు నెలవుగా మారింది. గత వారం రో జులుగా ఈ పాఠశాలలో చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు వెలుగు చూశాయి. ఈ నెల 14న జరిగిన ఘటన ఇంకా సమసిపోక ముందే …. మరో ఘటన జరిగినట్లు గోల్కొండ పోలీసులకు ఈ నెల 19న ఫిర్యాదు అందింది. వివరాల్లోకి వెళ్తే.. టోలీచౌకి అజీజ్‌బాగ్ కాలనీలో నివసించే ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కూతురు (6) ఆజాన్ ఇంటర్నేషనల్ పాఠశాలలో 6 వ తరగతి చదువుతున్నది.

అయితే తమ కూతురుపై స్కూల్‌లో లైంగిక దాడి జరిగిన ట్లు బాలిక తల్లిదండ్రులు ఈ నెల 19న ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు బాలికను గురువారం చిన్నారికి నీలోఫర్ దవాఖానలో పరీక్షలు చేయించారు. ఈ ఘటనపై లోతుగా విచారిస్తున్నామని , పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Other News

Comments are closed.