ఆటోబోల్తా: ముగ్గురు విద్యార్థులకు గాయాలు

share on facebook

మహబూబాబాద్‌,మార్చి19(జ‌నంసాక్షి): మానుకోట  జిల్లాలోని డోర్నకల్‌ మండలం చాప్లాతండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బోల్తాపడటంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు పదో తరగతి విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరగడంతో విద్యార్థులు పరీక్షకు ఆలస్యంగా వచ్చిన నేపథ్యంలో వారికి అనుమతించాలని డీఈవో ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆలస్యంగా అయినా పరీక్ష రాసారు.  పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ఆటో బోల్తా పడి ఈ  ముగ్గురు పదో తరగతి విద్యార్థులకు గాయాలయ్యాయి. మానస, రాకేశ్‌, నవీన్‌ అనే విద్యార్థులకు గాయాలు కావడంతో వెంటనే సవిూపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనివల్ల పరీక్షకు ఆలస్యమైంది. ప్రమాదం దృష్ట్యా ఈ విద్యార్థులు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వచ్చినా అనుమతించాలని జిల్లా విద్యాశాఖ అధికారి  ఆదేశించారు. ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించుకున్న విద్యార్థులు అనంతరం పరీక్షా కేంద్రానికి వెళ్లారు.

Other News

Comments are closed.