ఆదినుంచీ తెలంగాణపై కేంద్రం వివక్ష

share on facebook

అభివృద్ది విషయంలో కాళ్లల్లో కట్టెలు పెట్టే యత్నాలు
ఖమ్మంలోని 7 మండలాలను ఏపీలో కలిపారు
సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టును కోల్పోయాం
హైకోర్టు విభజన చేయకుండా ఐదేళ్లు జాప్యం
ఫెడరల్‌ స్ఫూర్తికి బిజెపి ప్రభుత్వం తూట్లు
బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్రాన్ని తూర్పారబట్టిన హరీష్‌ రావు
హైదరాబాద్‌,మార్చి7(జనం సాక్షి): రాష్ట్ర ఆవిర్భావం నుంచి తెలంగాణపై దాడి జరుగుతోందని, తెలంగాణపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వివక్ష చూపుతోందని మంత్రి హరీష్‌ రావు అన్నారు. తల్లిని చంపి బిడ్డను బతికించారన్న మోడీ వ్యాఖ్యలను మంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా కేంద్రంపై ప్రభుత్వం విరుచుకుపడిరది. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. రాష్ట్రంపై కేంద్రం దాడి చేస్తోందని విమర్శించారు. ఖమ్మంలోని 7 మండలాలను ఏపీలో కలిపిందని మండిపడ్డారు. అక్రమ బదలాయింపుతో తెలంగాణ సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టును కోల్పోయిందన్నారు. హైకోర్టు విభజన చేయకుండా ఐదేళ్లు జాప్యం చేసిందని అన్నారు. విభజన హావిూలు అమలు చేయడం లేదని మంత్రి తెలిపారు. బిడ్డను బతికించారు అంటూ కేంద్ర పెద్దలు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తున్నారని వ్యాఖ్యానించారు. ఐటీఐఆర్‌పై అన్యాయం చేసిందని, వెనకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వకుండా జాప్యం చేస్తోందని అన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని అడిగితే 24 రూపాయలు ఇవ్వలేదని మండిపడ్డారు. జహీరాబాద్‌లో నిమ్స్‌కు కేంద్రం రూ.500 కోట్లు ఇంకా ఎందుకు ఇవ్వడంలేదని అడిగారు. కరోనా సమయంలోనూ కేంద్రం అదనంగా రూపాయి ఇవ్వలేదని, కేంద్రం తీరుతో
తెలంగాణ ప్రతీ సంవత్సరం రూ.5 వేల కోట్లు నష్టపోతుందని, ఈ లెక్కన ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు నష్టపోతున్నామన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానం అద్భుతమని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు తెలిపారు. శాసన సభలో 2022`23 సంవత్సరానికి హరీష్‌ రావు బడ్జెట్‌ ప్రవేశ పెడుతూ ఆయన మాట్లాడారు. తెలంగాణలో అమలు చేసిన ప్రతి పథకాన్ని దేశంలో అమలు చేస్తున్నారన్నారు. దీంతో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణలో 24 గంటల కరెంట్‌ సరఫరా చేస్తున్నామని, నేడు ఆకలి చావులు, కరెంట్‌ కోతలు లేవన్నారు. తెలంగాణకు అదనపు నిధులు ఇవ్వమంటే మోడీ ప్రభుత్వం ఇవ్వటం లేదని మండిపడ్డారు. విభజన చట్టంలోని హావిూలను కేంద్రం నెరవేర్చలేదని, బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీపై కేంద్రం మాటతప్పిందని హరీష్‌ రావు విరుచుకపడ్డారు. ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్రం పట్టించుకోవడంలేదని, తెలంగాణకు ఇచ్చే గ్రాంట్లు 2 వేల 362 కేంద్రం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వైఖరి కాళ్లలో కట్టెపెట్టేలా ఉందని, ఫెడరల్‌ స్ఫూర్తికి బిజెపి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. కేంద్రం బ్జడెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. ఎఫ్‌ఆర్‌బిఎం పేరుతో రాష్టాల్ర మెడపై కేంద్రం కత్తి పెట్టిందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం నిరంకుశ వైఖరి మానుకోవాలని హెచ్చరించారు. కంఠంలో ప్రాణముండగా విద్యుత్‌ సంస్కరణలకు ఒప్పుకోమన్నారు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్‌కు కూడా కేంద్ర జాతీయ హోదా ఇవ్వలేదని విమర్శించారు. బావిల దగ్గర మోటర్లకు విూటర్లు పెట్టబోమని, తెలంగాణ పథకాలకు కేంద్ర డబ్బులు ఇవ్వడంలేని మండిపడ్డారు. రాష్టాల్రకు ఇవ్వాల్సిన డబ్బును సెస్సుల రూపంలో దొడ్డిదారిన వసూలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి అయోగ్‌ చేసిన సిఫార్సులను బుట్టదాఖలు చేసిందని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు పన్ను మినహాయింపు ఇవ్వడం లేదన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీకి అతీగతీ లేదని అన్నారు. కేంద్ర ప్రయోజిత పథకాల కోసం తెలంగాణకు విడుదల చేయాల్సిన 495 కోట్ల రూపాయలను ఏపీ ఖాతాలో జమ చేసిందని మండిపడ్డారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపుకు విద్యుత్‌ సంస్కరణకు లంక పెట్టిందన్నారు. విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయకపోవడం వల్ల ఐదేళ్లలో 25 వేల కోట్లు తెలంగాణ నష్టపోయిందని తెలిపారు. కేంద్ర బ్జడెట్లోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి హరీష్‌ రావు విమర్శలు గుప్పించారు.

Other News

Comments are closed.