ఆదిలాబాద్‌లో ఘనంగా పంద్రాగస్ట్‌ వేడుకలు

share on facebook

పోలీస్‌ మైదానంలో జెండా ఎగురేసిన మంత్రి జోగురామన్న

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 72వ స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రి జోగు రామన్న జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. అవార్డులకు ఎంపికైన ఉత్తమ ఉద్యోగులకు మంత్రి జోగు రామన్న ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపజేశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అదిలాబాద్‌ జిల్లా అన్ని రంగాలలో అభివృద్ది బాటలో పయనిస్తోందన్నారు. హరితహారం కార్యక్రమంలో ప్రజలు పాల్గొనడం ఎంతో అభినందనీయమని, మొక్కలు సంరక్షించడంలో ప్రజలు మరింత శ్రద్ధ వహించాలని కోరారు. ఉద్యోగుల భవన్‌లో మంత్రి జోగు రామన్న జాతీయ జెండాను ఎగురవేశారు. కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ దివ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ శోభా సత్యనారాయణ గౌడ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ విష్ణు వారియర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

 

Other News

Comments are closed.