ఆన్‌లైన్‌లోనూ బాణాసంచాపై నిషేధం

share on facebook

న్యూఢిల్లీ,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ రీజియన్‌లో బాణసంచా అమ్మకాలపై సుప్రీంకోర్టు విధించిన నిషేధం ఆన్‌లైన్‌ అమ్మకాలు, కొనుగోళ్లకు సైతం వర్తిస్తుందని ఢిల్లీ పోలీసులు గురువారంనాడు తెలిపారు. ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు, అమ్మకాలు చేసే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసు ప్రతినిధి మాధుర్‌ వర్మ విూడియాకు తెలిపారు. కొత్త ఉత్తర్వు అమల్లోకి రావడంతో అంతకుముందు ఇచ్చిన తాత్కాలిక లైసెన్సులు కూడా రద్దయినట్టేనని ఆయన చెప్పారు. నవంబర్‌ 1వ తేదీ వరకూ ఢిల్లీ, ఎన్సీఆర్‌ రీజియన్‌లో బాణసంచా అమ్మకాలపై నిషేధాన్ని పునరుద్ధరిస్తున్నట్టు అత్యున్నత న్యాయస్థానం గతం సోమవారంనాడు తీర్పుచెప్పింది. దీపావళి సీజన్‌లో వాతావరణ కాలుష్య స్థాయిని దృష్టిలో పెట్టుకుని కోర్టు ఈ ఉత్తర్వులిచ్చింది.

Other News

Comments are closed.