ఆపధర్మ సీఎంగా కేసీఆర్‌ను కొన‌సాగించ‌ద్దు : కోదండరామ్‌

share on facebook
హైదరాబాద్:ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని కోదండరామ్ మండిపడ్డారు. కేసీఆర్‌ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగించటం సరికాదన్నారు. కేసీఆర్‌ అనేక సార్లు అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.  అసెంబ్లీ‌ని రద్దు చేసి కేసీఆర్‌ తన చేతకానితనాన్ని బయటపెట్టుకున్నారని కోదండరామ్‌ విమర్శించారు.  తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని కోదండరామ్‌ తెలిపారు. మంచి పాలన చేసే ముఖ్యమంత్రి అసెంబ్లీని రద్దు చేయరని కోదండరామ్‌ అన్నారు.
త్వరలో తెలంగాణ జనసమితి అభ్యర్థులను‌ ప్రకటిస్తామని కోదండరామ్‌ అన్నారు.

Other News

Comments are closed.