ఆయుర్వేద మందుల విక్రయం పేర మోసం

share on facebook

ముఠాను అరెస్ట్‌ చేసిన పోలీసులు

హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): ఆయుర్వేదం, యునాని ఉత్పత్తుల పేరుతో మోసానికి పాల్పడుతున్న ముఠా గుట్టును సైబరాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. ప్రో హెల్తీ వేజ్‌ ఇంటర్నేషనల్‌ మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ సంస్థ అక్రమంగా ఆయుర్వేద ఉత్పత్తులు అమ్ముతున్నట్లు పోలీసులు నిర్దారించారు. ఈ సంస్థకు ఎలాంటి అనుమతులు లేవని, తెలంగాణ జిల్లాలనే టార్గెట్‌ చేసి ఉత్పత్తులు విక్రయిస్తున్నారని సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. ఈ సంస్థకు చెందిన తొమ్మిది మంది డైరెక్టర్లను అరెస్ట్‌ చేశామన్నారు. దాదాపు రూ.30కోట్ల స్కామ్‌కు పాల్పడ్డారని సీపీ తెలిపారు. వీరికి సంబంధించిన బ్యాంక్‌ అకౌంట్లు సీజ్‌ చేశామన్నారు. గొలుసుకట్టు విధానంలో కస్టమర్లను చేర్పించి మోసానికి పాల్పడినట్లు సీపీ వివరించారు.

 

 

Other News

Comments are closed.