ఆరేళ్లయినా ఇంకా తీర్పులకే పరిమితమా?

share on facebook

మనదేశంలో సంచలనం సృష్టించిన కేసుల్లోనూ న్యాయం ఆలస్యం అవుతోందనడానికి నిర్భయ కేసు ఉదాహరణగా తీసుకోవాలి. న్యాయమూర్తులు ఇటీవల సుప్రీం ప్రధాన న్యాయమూర్తి తీరుపై నిరసన వ్యక్తం చేసి తిరుగుబాటు చేసినంద పనిచేశారు. కానీ చేయాల్సింది కోర్టు తీర్పులు ఆలస్యం కారణంగా ఎంత నష్టం జరుగుతుందో ఆలోచన చేయాలి. ఆలస్యం అమృతం విషం అన్నారు. నిర్భయ కేసు ఎంత సంచలనం సృష్టించిందో ప్రపంచానికి తెలుసు. ఈ కేసులో ఏడాది తిరక్క ముందే దోషులకు ఉరిశిక్ష విధించి ఉంటే తరవాత జరిగే అరచాకాలను కొంతయినా అరికట్టగలిగే వాళ్లం. కానీ న్యాయవ్యవస్థలో ఉన్న లొసుగుల కారణంగా ఆరేళ్ల కాలంగా తీర్పుకోసమే ఎదురు చూశాం. దీనిని అమలు చేయడానికి ఇంకెంతకాలం పడుతుందో చెప్పలేం.సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో దోషులకు మరణ దండన సరైనదేనని సుప్రీంకోర్టు సోమవారం తన తీర్పు ద్వారా పునరుద్ఘాటించింది. మరణదండనను సమర్థిస్తూ గతంలో ఇచ్చిన తీర్పును పునఃసవిూక్షించాలంటూ ముగ్గురు దోషులు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. వారి అభ్యర్థనకు ప్రాతిపదిక లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర, న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.బానుమతి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

నిజానికి ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకుని కఠిన చట్టం తెచ్చిన తరవాత కూడా దేశంలో అత్యాచార పరంపరలు ఆగడం లేదు. మృగాళ్లకు భయం లేకుండా పోతోంది. ఆడదానిపై చేయేస్తే చేయి పోతుందన్న రీతిలో చట్టాలు ఉండాలి. ఆలస్యం కాకుండా శిక్షలను అమలు చేయగలిగేలా చర్యలు ఉండాలి. మరనదండన సరికాదని వాదిస్తున్న వారు జరిగిన, జరుగుతున్న అఘాయిత్యాలను ఎలా ఆపుతారో చెప్పాలి. అఘాయిత్యాలకు పాల్పడ్డవాడు బతకడానికి వీలు లేకుండా చేయడం వల్ల మాత్రమే నేరాలను ఆపగలుగుతాం.2012, డిసెంబరు 16 అర్ధరాత్రి దిల్లీలో జరిగిన అత్యాచార సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కదులుతున్న బస్సులో 23 ఏళ్ల పారామెడిక్‌ విద్యార్థినిపై ఆరుగురు అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడడమే కాకుండా ఆమెను అతి దారుణంగా హింసించి, తీవ్రగాయాలు చేసి రోడ్డుపైకి తోసేసి వెళ్లిపోయారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న డిసెంబరు 29న సింగపూర్‌లోని ఎలిజబెత్‌ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచింది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం కేసు.. విచారణ న్యాయస్థానం, హైకోర్టు, సుప్రీం కోర్టుల చుట్టూ ఎన్నో మలుపులు తిరిగింది. ఈ కేసులో దోషులకు ఇప్పటికీ న్యాయపరమైన పరిష్కారాలు అందుబాటులో ఉన్నాయి. తమ అప్పీళ్లను, పునఃసవిూక్ష అభ్యర్థనలను తోసిపుచ్చడంపై పునఃపరిశీలించాల్సిందిగా క్యూరేటివ్‌ పిటిషన్‌ ద్వారా కోరవచ్చు. న్యాయపరంగా ఉన్న చిట్టచివరి అవకాశం ఇదే. అక్కడ కూడా వారికి తిరస్కరణ ఎదురయితే రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరవచ్చు. అంటే న్యాయం జరగడానికి ఇంకెంత కాలం వేచిచూడాలో చెప్పలేం. ఉరిశిక్ష విధిస్తే వద్దంటున్నవారు అమానుషం జరగకుండా చూడగలరా అన్న హావిూ ఇవ్వగలరా అన్నది చెప్పాలి. నిజానికి శిక్షలు కఠినంగా లేకుంటే ప్రజల్లో భయమన్నది లేకుంటే ఇక ధర్మం ఎలా నడుస్తుందో సెలవివ్వాలి. తప్పు చేసిన వాడిని జైల్లో పెట్టి మార్చాలంటే జీవిత కాలం పడుతుంది. ఇలా ఎంతమందిని మారుస్తాం… భయమే అన్ని అకృత్యాలను అరికడుతుంది. భయం లేకపోవడం వల్లనే సమాజాంలో విచ్చలవిడితనం పెరిగిపోతోంది. ఢిల్లీలో నిర్భయపై జరిగిన అమానుష అత్యాచార ఘటనలో నేరస్థులకు సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించిన తరవాత అమానుషాలు ఆగలేదు. అదే త్వరగా ఇలాంటి కేసుల్లో ఉరిశిక్షలు అమలు చేస్తూ, తప్పులకు పాల్పడ్డ వారినందరిని ఉరితీస్తే ఇలాంటి

ఘటనలు జరిగేవా. నిర్భయ జడ్జిమెంటును దేశంలోని అత్యధిక ప్రజానీకం స్వాగతించారు. ఈ తీర్పు దేశవ్యాప్తంగా పెల్లుబుకిన ప్రజా ఉద్యమ ఫలితం అని చెప్పక తప్పదు. కేవలం కఠినశిక్షలను అమలు చేస్తూ పోతుంటే తప్ప అత్యారారాలు లేదా అకృత్యాలను అరికట్టగలం. ప్రజల్లో భయమన్నది ఉండాలి. ఏదిపడితే అది చేస్తామంటే కుదరదని గుర్తుంచుకోవాలి. అయితే ఇది పాలకులు మొదలు సామాన్యులకు కూడా వర్తించాలి. దేశంలో ఆడది ఒంటరిగా తిరగడం పక్కన పెడితే కలసి తిరిగినా మృగాళ్లు వదిలి పెట్టడం లేదు. అందుకే కఠిన చట్టాలు,శిక్షలు లేకుంటే అమ్మాయిలపై అత్యాచారాలకు తెరపడదు. కఠిన శిక్షలు తప్పనిసరిగా ఉండవలసిందే, దాంతోపాటుగా ఈ విష సంస్కృతికి ఆజ్యం పోస్తున్న అశ్లీల అసభ్య సినిమాల్ని, సాహిత్యాల్ని, ఇంటర్నెట్‌ పోర్నోగ్రఫీని, మద్యం మాదకద్రవ్యాలకు అడ్డుకట్ట వేయకుండా స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలకు అడ్డుకట్ట వేయలేం. వ్యవస్థలో పెచ్చరిల్లుతున్న విష సంస్కృతికి ఎలా అడ్డుకట్ట వేయాలన్నది ఆలోచన చేయాలి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో సుప్రీంకోర్టు ప్రకటించిన తీర్పు కూడా సంచలనమైనదే. దేశరాజధాని ఢిల్లీలో ఆళ్ల క్రితం కదులుతున్న బస్సులో ఆమెను అత్యంత పాశవికంగా హింసించి సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు దోషులకు సర్వోన్నత న్యాయస్థానం ఉరిశిక్ష ఖరారుచేసింది. బతకాలని కోరుకుంటున్న ఈ మృగాళ్లు ఓ అబల జీవితాన్ని నాశనం చేయడమే గాకుండా, ఆమె మరణానికి కారణమయ్యారు. ఈ హక్కు వారికి ఎవరిచ్చారన్నది ప్రశ్న. అందుకే దోషులకు తక్షణం ఉరేసేలా చట్టాల్లో మార్పు రావాలి. తక్షణ శిక్షలు పడేలా తీర్పులు ఉండాలి. అప్పుడే సమాజం సక్రమగతిలో నడుస్తుంది.

 

Other News

Comments are closed.