ఆశ వర్కర్ల పాలాభిషేకం

share on facebook

జోగులాంబ గద్వాల్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌ లో ఆశ వర్కర్లు కేసీఆర్‌ చిత్ర పటానికి పాలభిషేకం చేశారు. గతంలో తమకు ఉన్న ఆరు వేల జీతాన్ని తెలంగాణ ప్రభుత్వం 7,500 పెంచడంతో ఆశావర్కర్లు అందరూ కేసీఆర్‌ చిత్ర పటానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్లు మాట్లాడుతూ ఆశ వర్కర్ల కష్టాన్ని గుర్తించి తెలంగాణ ప్రభుత్వం.. గతంలో ఉన్న ఆరు వేల రూపాయల జీతాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు 7500 రూపాయలు చెయ్యడం చాలా సంతోషంగా ఉందని, కేసీఆర్‌ కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని హర్షం వ్యక్తం చేశారు.

 

Other News

Comments are closed.