ఆ ముగ్గురూ సైంధవుల్లా మారారు: మంత్రి నారాయణ

share on facebook

నెల్లూరు,మార్చి30(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీ లాలూచీ రాజకీయాలు చేస్తోందని మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ-జగన్‌-పవన్‌ రాష్ట్రానికి  సైంధవుల్లా మారారని విమర్శించారు. శుక్రవారం ఉదయం పెన్నా బ్యారేజీ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెన్నా బ్యారేజీ పనులు దాదాపు పూర్తయ్యాయన్నారు. కాంక్రీట్‌ పనులు, గేట్లు బిగించే పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని…మరో రెండు నెలల్లో బ్యారేజీని అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అలాగే ఇక్కడి గుడ్‌ఫైడ్రే ప్రార్థనల్లో పాల్గొని క్రీస్తు శిలువను మోసారు. రాష్ట్రానికి  ప్రత్యేక ¬దా ఇచ్చేంత వరకు కేంద్ర ప్రభుత్వంపై ప్రతిఒక్కరూ పోరాడాలని  ఈ సందర్భంగా నారాయణ పేర్కొన్నారు. నాడు ఎన్టీఆర్‌కు అన్యాయం చేసిన ప్రధానమంత్రి ఎన్నికల్లో ఓడిపోయారని, ప్రస్తుతం ప్రధాన మంత్రీ భవిష్యత్తులో ఓడిపోకతప్పదని జోస్యం చెప్పారు. ప్రత్యేక ¬దా కోసం ప్రజలంతా శాంతియుతంగా నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్‌ తెదేపా స్థాపించారన్నారు. నేడు ఆ ఆత్మగౌరవం కేంద్రానికి గుర్తులేదా అని ప్రశ్నించారు.

Other News

Comments are closed.