ఆ మూడు రాష్ట్రాల ఎన్నికలే కీలకం

share on facebook

వ్యూహాలు పన్నుతున్న బిజెపి..విపక్షాలు

తెలంగాణలో ఒంటరిపోరుతో నష్టమే

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): సార్వత్రిక ఎన్నికలకు నాలుగైదు నెలల ముందుగా, అంటే ఈ ఏడాది నవంబరు లేదా డిసెంబరులో మూడు బిజెపి పాలిత రాస్ట్రాలకు ఎన్నికలు జరుగనుండగా బిజెపి మళ్లీ విజయం కోసం వ్యూహాలు పన్నుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,అమిత్‌షాలు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ ఏడాది చివరిలో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగవలసి ఉంది. తెలంగానలో కూడా ముందస్తు కోసం అసెంబ్లీ రద్దు చేయడంతో నవబంర్‌లో ఎన్నికలు జరిగేలా ఇసి కసరత్తు చేస్తోంది. ఆ మూడు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నందున అక్కడ పాగా వేయడం ద్వారా సార్వత్రిక ఎన్నికల్లో మోడీని అడ్డుకోవాలని విపక్షాలు కూడా వ్యూహాలు పన్నుతున్నాయి. తెలంగాణలో ఉన్నసీట్లు కూడా వచ్చే స్థితి కనిపించడం లేదు. శాసనసభ ఎన్నికలలో ఓడిపోతే ఆ తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మోడీని ఢీకొనడం ఈజీ అన్న అభిప్రాయంతో ఉన్నారు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ప్రజలలో వ్యతిరేకత ఉంటే శాసనసభ ఎన్నికలలో ఓడిపోతే ఆ తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికలలో వ్యతిరేక ప్రభావం ఉంటుందన్న విషయం గ్రహించి ఆ మేరకు బిజెపి ద్వయం వ్యూహం పన్నుతోంది. ఇప్పటికప్పుడు ఇక ఏకకాలంలో జమిలి ఎన్నికలు జరగవని తేలిపోయింది. లోక్‌సభ ఎన్నికలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయి. లోక్‌సభ ఎన్నికలతోపాటు శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరగడానికి అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో ఈ మూడు రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేసి లోక్‌సభతో జరిపిస్తే ఎలా ఉంటుందన్న వాదన బిజెపిలో ఉందన్న ప్రచారం కూడా సాధ్యం కాదని తెలుస్తోంది.ఆయా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన ఉంటే తప్ప ఇది సాధ్యం కాకపోవచ్చు. ఇకపోతే ఇటీవలి ఉప ఎన్నికలలో దెబ్బతిన్న భారతీయ జనతాపార్టీ నాయకులు జరిగిన

పొరపాట్లకు పాశ్చాత్తాపం చెంది దూరమవుతున్న మిత్రపక్షాలను మళ్లీ అక్కున చేర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో పొత్తులకు రంగం సిద్ధం చేసుకుంటోంది. మొత్తం విూద అటు జాతీయ స్థాయిలోనూ,

ఇటు రాష్ట్రాలలోనూ ఏడాది ముందుగానే ఎన్నికల వేడి అందుకుంటోంది. అయితే ఎన్నికలు ఎప్పుడు జరిగినా గతంలో లాగా మోడీ దూకుడు పనిచేయకపోవచ్చు. ఆయా రాష్ట్రాల్లో కూడా బిజెపిపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. మొత్తానికి బిజెపికి ఎన్నికలు నల్లేరువిూద నడక కాకపోవచ్చు. తెలంగాణలో ఒంటరి పోరు తప్పడం లేదు. గతంలో ఇక్కడ టిడిపితో కలసి పనిచేయడంతో ఇప్పుడు ఒంటరిగానే పోరుబాట పట్టనుంది.

Other News

Comments are closed.