ఇంటింటా ఉత్సాహంగా రక్షాబంధన్ వేడుకలు

share on facebook

జనంసాక్షి/ చిగురుమామిడి – ఆగష్టు 12:
సోదరీమణులు, సోదరుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక అయిన రక్షాబంధన్‌ (రాఖీ పౌర్ణమి) వేడుకలు మండలంలోని 17 గ్రామాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వయసు తారతమ్యం లేకుండా అందరూ ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంటింటా రాఖీ పండుగ సందడి నెలకొంది. సుదూర ప్రాంతాలలో ఉన్న సోదరీమణులు తమ పుట్టిళ్లకు వచ్చి అన్నదమ్ములకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. రాఖీ పౌర్ణమి, శ్రావణ శుక్రవారం సందర్భంగా ఫ్యాన్సీ షాపులు, స్వీట్‌ స్టాల్సు, పండ్ల దుకాణాలు కొనుగోలు దారులతో సందడిగా కనిపించాయి. స్థానిక ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై దాస సుధాకర్, మండలంలోని 17 గ్రామాల్లో సర్పంచ్ లు, ఎంపీటీసీ కుటుంబ సభ్యులతో పాటుగా బిసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచారకార్యదర్శి దాసరి ప్రవీణ్ కుమార్ ,లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గాధే రఘునాథ్ రెడ్డి ఇళ్ళలో రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Other News

Comments are closed.