ఇంటింటా సర్వేతో వ్యాధుల అంచనా

share on facebook

వర్షాకాల వ్యాధులపై ప్రజలరు అవగాహన

ఆదిలాబాద్‌,జూలై12(జ‌నం సాక్షి): వర్షాల కారణంగా గ్రామాల్లో అపరిశుభ్రత నెలకుంటుంది. ఫలితంగా మలేరియా, టైఫాయిడ్‌ ఇతర వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గ్రామాల్లో ఈ సీజన్‌లో పరిశుభ్రతపై అధికారుల ముందస్తు ప్రణాళికలు తయారు చేసి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. పంచాయతీ సిబ్బందితో పాటు కూలీలను గ్రామాల్లో మురికి కాలువలను శుభ్రం చేయడంతో పాటు, చెత్తా చెదారాన్ని తొలగిస్తున్నారు. నీటి గుంటల్లోని నీటిని తొలగించడం, ఇత ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చేస్తున్నారు. వైద్యసిబ్బంది దోమల వృద్ధి చెందకుండా ఐఆర్‌ఎస్‌ స్పే చేస్తున్నారు. కలుషితమై నీరు తాగి డయేరియా లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉండటంతో తాగునీటి బావుల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతున్నారు. గ్రామల్లోని స్థానికులకు పంపిణీ చేసిన దోమ తెరల వాడకంపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. వర్షాకాలం వ్యాధుల నివారణకు చేపడుతున్న కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించారు. వీరు రోజు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి నివేదికలు అందించాల్సి ఉంటుంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహిస్తై అనారోగ్యంతో బాదపడుతున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, హెల్త్‌ అసిస్టెంట్‌లు, ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్‌లు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి స్థానికులు వివరాలు సేకరిస్తారు. ఎవరైనా అనారోగ్యంతో బాధపడితుంటే వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి వైద్యసేవలు అందిస్తారు. గ్రామస్థాయిలో ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు ఎవరైనా అనారోగ్యం బారిన పడితే వైద్య సిబ్బందికి వెంటనే సమాచారం ఇస్తారు. ఇంటి నుంచి ఏవరైనా ఇతర గ్రామాలకు వెళ్లారా, పాఠశాలల్లో చదువుకునే పిల్లలు సొంత గ్రామానికి జ్వరంతో వచ్చారా అనే వివరాలు సేకరిస్తారు. గర్భవతులు ఉంటే వారికి సరైన చికిత్స అందుతుందా లేదా అనే విషయాలను అడిగి తెలుసుకుంటారు. ఇండ్లలో సంవత్సరం చిన్నారులు ఉంటే వారికి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌ ఇస్తారు. గ్రామాల్లోని వైద్యశిబిరాలు నిర్వహించి వ్యాధులతో బాధపడుతున్న వారికి అవసరమైన చికిత్సలు అందజేస్తున్నారు. వీటితో పాటు తాగునీటి బావుల్లో బ్లీచింగ్‌ చేశారా ఐఆర్‌ఎస్‌ దోమల స్పే జరిగిందా లేదా అనే విషయాలను పరిశీలిస్తారు. ఏటా జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షంకాలంలో వ్యాధులు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా కురుస్తోన్న వర్షాలతో వ్యాధుల ప్రబలే ప్రమాదం ఉంది. సీజనల్‌ వ్యాధులు రాకుండా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో ముందుస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ ఏడాది సైతం వర్షాకాలం వ్యాధులపై అధికారులు ముందుగానే ప్రణాళికలు తయారు చేసి వ్యాధులు రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.

—–

 

Other News

Comments are closed.