ఇందూరు రక్త దాతల మూడో వార్షికోత్సవం

share on facebook

నిజామాబాద్‌,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): ఇందూరు బ్లడ్‌ డోనర్స్‌ గ్రూపు 3వ వార్షికోత్సవం సంధర్భంగా ఐడియా షో రూం యాజమానీ సాగర్‌ ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరంలో ముఖ్య అతిథిగా నగర మేయరు ఆకుల సుజాత పాల్గోన్నారు. విశిష్ట అతిథిగా ఆర్మూరు కు చేందిన డాక్టరు మధుశేకర్‌, ఆత్మీయ అతిథిగా రోటరి క్లబ్‌ అధ్యక్షులు రాజ్‌ కుమార్‌ సూబేధార్‌ పాల్గొన్నారు. ఈ సంధర్భంలో ఇందూరు బ్లడ్‌ డోనర్స్‌ గ్రూప్‌ ప్రధాన అడ్మిన్‌ నరాల సుధాకర్‌ ను, రేడ్‌ క్రాసు సేక్రేటరి బస్స ఆంజనేయులును, ఇందూరు బ్లడ్‌ గ్రూపు సహ అడ్మీన్‌ లు అయిన రామకృష్ణను,పురుషోత్తం రేడ్డి నీ నిర్వాహకులు కోక్కుల సాగర్‌ శ్రీమతి లక్ష్మి సాగర్‌ లు ఘనంగా సత్కరించారు…. ఈ సంధర్భంలో దాదాపు 30 మంది యువకులు, ఇందూరు బ్లడ్‌ డోనర్స్‌ సభ్యులు రక్త దానం చేయ్యడం జరిగింది…. ఇందూరు బ్లడ్‌ డోనర్స్‌ గ్రూపు ప్రధాన అడ్మీన్‌మాట్లాడుతూ తమ గ్రూపు ద్వార ఇప్పటి వరకు 1500 మందికి రక్తదానం చేసే అవకాశం రావడం సంతోషకరం అని అన్నారు…. ఇంక ఈ కార్యక్రమంలో డాక్టరు నీలి రాంచందర్‌, తోట రాజశేఖర్‌, కోక్కుల నవీన్‌ తదితరులు పాల్గోన్నారు

 

Other News

Comments are closed.