ఇక విద్యార్థులకు రవాణాభత్యం

share on facebook

హైదరాబాద్‌,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి):మరో అరుదైన పథకానికి ప్రభుత్వం శ్రీకరారం చుట్టబోతున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు దూరప్రాంతాల నుంచి పాఠశాలకు వచ్చి చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం రవాణా భత్యం అందజేస్తుంది. ఈ రవాణా భత్యం పది నెలలపాటు రూ.300 చొప్పున విద్యార్థికి, సంరక్షకుల జాయింట్‌ అకౌంట్‌లో లేదా విద్యార్థి బ్యాంక్‌ అకౌంట్‌లో ప్రభుత్వం జమచేస్తుంది. అయితే ఈ రవాణా భత్యం కేవలం 3 కి.విూటర్ల లోపు ప్రాథమిక పాఠశాల, 5 కి.విూటర్ల లోపు ప్రభుత్వ ఉన్నత పాఠశాలు లేని విద్యార్థులకు మాత్రమే అందజేస్తుంది. అర్హత గల విద్యార్థులు వారు చదివే పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించాలి.

 

Other News

Comments are closed.