ఇమ్రాన్‌ నుంచే  శాంతి ప్రయత్నాలు మొదలవ్వాలి  

share on facebook

భారత్‌-పాక్‌ మధ్య ఉన్న ఒకే ఒక సమస్య కశ్మీర్‌ పాక్‌ కొత్త ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తన చిత్తశుద్దిని నిరూపిం చుకునే ప్రయత్నాలను అటునుంచే మొదలు పెట్టాలి. ముందుగా దేశ విభజన నుంచి జరిగిన ఘటనలు ఆధారం చేసుకుని ఉగ్రవాదాన్ని నిలిపివేసే చర్యలకు పూనుకోవాలి. శాంతియుత వాతావరణం నెలకొనే వారకు కాశ్మీర్‌ అంవాన్ని పక్కన పెట్టి ముందుగా శాంతికి పూనుకోవాలి. శాంతికి మార్గం ఉందన్న ఆయన ప్రయత్నాలను ఆహ్వానించాల్సిందే. దేశంలో ఉన్న సైన్యం,ఐఎస్‌ఐ తన ఆధీనం ఉన్నాయో లేదో గమనిం చాలి. అందుకు  ముందుగా పాక్‌ నుంచి శాంతిబాట వేస్తే ప్రపంచంలోనే అరుదైన వ్యక్తిగా మిగిలి పోతారు. దేశంలో తీవ్రవాద శిబిరాలను తొలగించి, సరిహద్దుల్లో సైన్యాం దూకుడును కంట్రోల్‌ చేసి శాంతికి పూను కునే ప్రయత్నాలు చేయడం ద్వారా చిత్తశుద్దిని చాటాలి.  పరిష్కరించుకొనేందుకు రెండు దేశాల్లో సమర్థ మైన నాయకత్వాలు కావాలంటున్న ఇమ్రాన్‌ మనకు ఉన్న సామర్థ్యంతో ఈ సమస్యను పరిష్కరించు కుంటే మన బంధాలు ఇంకా బలపడతాయన్న భావన మంచిదే. తన పార్టీ పాకిస్థాన్‌ తెహ్రెక్‌-ఎ-ఇన్సాఫ్‌ సహా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు, సైన్యం కూడా భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. జర్మనీ, ఫ్రాన్స్‌ దేశాలు కూడా ఒకప్పుడు బద్ధ శత్రువులుగా ఉన్నాయని, ఇప్పుడు మిత్ర దేశాలుగా మారిపోయాయని గుర్తు చేశారు. ఇలాగే పాక్‌-భారత్‌ కూడా కలిసిపోయి ఇరుగుపొరుగు మిత్ర దేశాలుగా ఎందుకు ఉండలేవని ప్రశ్నించారు. నిజానికి ఎన్నో ఏళ్లుగా అంటే విభజన నాటినుంచే విష బీజాలు నింపుకున్న పాక్‌ భారత్‌తో యుద్దమే చేసింది తప్ప స్నేహాన్ని కోరుకోలేదు. మారణ¬మాన్ని సృష్టిస్తూ ఉగ్రవాదులను ఎగదోస్తూ ఎన్నో ఘాతుకాలకు పాల్పడింది. ఇంకా దానిని కొనసాగిస్తూనే ఉంది. శాంతి వచనాలు పలుకుతున్న ఇమ్రాన్‌ ఖాన్‌ ముంఉదగా లోపాలను గుర్తించి అటువైపుగా ప్రయత్నాలు ప్రారంబించాలి. ప్రపంచ దేశాలకు నమ్మకం కలిగించాలి. పాక్‌తో సత్సంబంధాల కోసం భారత్‌ ఒక అడుగు వేస్తే పాక్‌ రెండడుగులు వేస్తుందని ఇమ్రాన్‌ చేసిన ప్రకటనలో చిత్తశుద్ది ఉందని నిరూపించుకోవాలి. ఇప్పుడు బంతి పాక్‌ కోర్టులోనే ఉంది. భారత్‌-పాక్‌ మధ్య ఏర్పాటు చేయనున్న కర్తార్‌పూర్‌ నడవాకు పాకిస్థాన్‌లో శంకుస్థాపన చేసిన సందర్భంగా ఇమ్రాన్‌ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు నిజం కావాలనే కోరుకుందాం.  కార్యక్రమానికి భారత్‌ తరపున కేంద్ర మంత్రులు హర్‌ సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌, హర్‌దీప్‌ సింగ్‌ పూరీ, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ హజరయ్యారు. కేంద్ర మంత్రి హర్‌ సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ మాట్లాడుతూ ఒక సందర్భంలో భావోద్వేగానికి లోనయ్యారు. బెర్లిన్‌ గోడ పడగొట్టినట్లే.. కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభంతో రెండు దేశాల మధ్య విద్వేషాలు మట్టికరిచి పోవాలని ఆకాంక్షించారు. ఈ నడవా ప్రారంభం కొత్త అధ్యాయా నికి తెరతీయాలని అభిప్రాయపడ్డారు. పంజాబ్‌ రైలు లా¬ర్‌ వరకూ వెళ్తుందని నా తండ్రి నాకు చెప్పే వారు. కానీ ఆ రైలు భవిష్యత్తులో పెషావర్‌ వరకూ, అఫ్గానిస్థాన్‌ వరకూ వెళ్తుందని నేను నమ్ము తున్నానని  పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూ వ్యాఖ్యానించారు. పంజాబ్‌లోని గుర్‌దాస్‌పూర్‌ జిల్లా డేరా బాబా నానక్‌ పట్టణం నుంచి పాకిస్థాన్‌ కర్తార్‌పూర్‌లో గురుద్వారా దర్బార్‌ను అనుసంధానించడం ఈ నడవా లక్ష్యం.  భారత్‌లో ఈ నడవాకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌తో కలిసి శంకుస్థాపన చేసారు.ఈ నడవా ద్వారా పాకిస్థాన్‌లోని ప్రఖ్యాత సిక్కు పుణ్యక్షేత్రం గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ను భారత యాత్రికులు వీసా లేకుండా సులువుగా దర్శించుకొనే వీలు పడుతుంది. ఈ నడవా ఏర్పాటు చేయాలని దాదాపు 20 ఏళ్లుగా భారత్‌ పాకిస్థాన్‌ను కోరుతోంది. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రమాణ స్వీకారం సందర్భంగా అక్కడికి వెళ్లిన పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌
సిద్ధూకు ఆ దేశ సైన్యాధిపతి జావెద్‌ బజ్వా ఈ ప్రాజెక్టుకు సంబంధించి హావిూ ఇవ్వడంతో నడవాపై ఆశలు చిగురించాయి. గురునానక్‌ 550వ జయంతి సందర్భంగా డేరా బాబా నానక్‌ నుంచి గురుద్వారా కర్తార్‌పూర్‌ సాహిబ్‌ వరకూ నడవా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. పాకిస్థాన్‌ విూడియా ఈ కార్యక్రమానికి ఊహించనంత ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. ఎన్నో యుద్ధాలు చేసుకున్న ఫ్రాన్స్‌, జర్మనీ లు ద్వారాలు తెరిచిపెట్టి స్నేహాన్నీ, వాణిజ్యాన్నీ పంచుకుంటు న్నప్పుడు మనకు ఎందుకు సాధ్యం కాదని ఇమ్రాన్‌ ప్రశ్నించడం ఆహ్వానించదగ్గదే. సిద్దూ ఒక శాంతిదూతలాగా ఇరుదేశాల మధ్యా వ్యవహరిస్తే అంతకు మించిన ఆనందం మరోటి ఉండదు. ఇరుదేశాల మధ్యా ఏకైక సమస్య కశ్మీర్‌ ఒక్కటేననీ, మానవుడు చంద్రుడిపై కాలుమోపుతున్నప్పుడు పరిష్కరించుకోలేని సమస్యలంటూఉంటాయా?  అని ఇమ్రాన్‌ ప్రశ్నించారు. ఈ వేదికపై కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తి దానిని రాజకీయం చేయడానికి ఇమ్రాన్‌ ప్రయత్నించారంటూ భారత్‌ వెంటనే అభ్యంతరం ప్రకటించింది. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తూ, సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌ ముందుగా ఆ పరిస్థితులను మార్చి అంతర్జాతీయ సమాజానికి ఇచ్చిన హావిూని నిలబెట్టుకోవాలంటూ భారత్‌ ఘాటుగానే స్పందించింది. నిజంగానే ఇమ్రాన్‌ చేయా/-లసిన పని అదే. కాశ్మీర్‌ అంశాన్ని పక్కన పెట్టి ముందుగా తమ సచ్చీలతను నిరూపించుకోవాలి. పాక్‌ ప్రధానులుగా ఉన్నవారు పైకి ఎన్నిమాటలు చెప్పినా, పాకిస్థాన్‌ ఆర్మీ మాత్రం శాంతి ప్రయత్నాలను  చెడగొట్టడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఈ విషయం కొత్తగా ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు. శాంతి తన అభిమతమైతూ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ముందుగా తనవంతుగా ఉగ్రవాద నిరోధక ర్యలకు నడుం బిగించాలి. సరిహద్దుల్లో సైన్యం ఆగడాలను ఆపాలి. ఉగ్రవాదుల  చొరబాట్లను కఠినంగా నిలిపివేయాలి. అప్పుడు ప్రపంచం కూడా అభినందిస్తుంది. అందుకు పూనుకోవడం ప్రధానిగా చొరవతీసుకుని చిత్తశుద్ది చాటాలి.

Other News

Comments are closed.