ఇళ్ల పేరుతో సామాన్యులను మభ్య పెట్టారు: మురళీధర్‌ రావు

share on facebook

సిద్దిపేట,నవంబర్‌12(జ‌నంసాక్షి): తెలంగాణలో ఎక్కడా డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మించలేదని బీజేపీ సీనియర్‌ నేత,పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఆరోపించారు. ఇళ్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టారని అన్నారు. బూత్‌ స్థాయి కమిటీల సమావేశానికి మురళీధర్‌రావు హాజరై మాట్లాడారు. సిద్దిపేటలో భయానక వాతావరణం కనబడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌, టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌కు అమ్ముడు పోయారని విమర్శించారు. దొంగలంతా టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారని వ్యాఖ్యానించారు. సిద్దిపేటలో టీఆర్‌ఎస్‌ గుండాయిజానికి.. ధన బలానికి నిలబడే దమ్మున్న పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు. టీఆర్‌ఎస్‌లో అన్ని పదవులు ఒకే కుటుంబానికి దక్కాయని ధ్వజమెత్తారు.

 

Other News

Comments are closed.