ఈ విజయం ఆ బాలలకు అంకితం

share on facebook

ఫిపా సెవిూజ్‌ విజేత పాల్‌పోగ్మా

మాస్కో,జూలై11(జ‌నం సాక్షి): రష్యాలో నిర్వహిస్తున్న ఫిఫా ప్రపంచకప్‌ సెవిూ ఫైల్లో విజయం సాధించి ఫైనల్‌ చేరిన ఫ్రాన్స్‌ జట్టు తమ విజయాన్ని థాయ్‌లాండ్‌లో గుహ నిర్బంధంలో నుండి బయటపడిన బాలురకు అంకితమిస్తున్నట్లు ప్రాన్స్‌ క్రీడాకారుడు పాల్‌ పోగ్మా ప్రకటించారు. వారి సాహసం మరువలేనిదన్నాడు. ఇటీవల 18 రోజుల పాటు థాయ్‌లాండ్‌లోని లువాంగ్‌ గుహలో చిక్కుకున్న వైల్డ్‌ బోర్స్‌ సాకర్‌టీమ్‌ జట్టు బాలురు 12 మందితో పాటు కోచ్‌ను మంగళవారం థారు నేవీసీల్స్‌ సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఫిఫా ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన తొలి సెవ్గిూ/నైల్లో ఫ్రాన్స్‌-బెల్జియం తలపడ్డాయి. హౌరాహౌరీగా సాగిన ఆటలో 51వ నిమిషంలో ఫ్రాన్స్‌ ఆటగాడు శామ్యూల్‌ ఉమిటిటి హెడర్‌తో బంతిని గోల్‌సోస్ట్‌లోకి పంపించి ఫ్రాన్స్‌కు 1-0 ఆధిక్యాన్ని

అందించాడు. ఆ తర్వాత బెల్జియం గోల్‌ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఫ్రాన్స్‌ విజయం సాధించి ్గ/నైల్‌కు దూసుకుపోయింది. మ్యాచ్‌ అనంతరం ఫ్రాన్స్‌ ఆటగాడు పాల్‌ ‘ఈ విజయాన్ని థాయ్‌లాండ్‌లో గుహ నిర్బంధంలో చిక్కుకుని సురక్షితంగా బయటికి వచ్చిన బాలల ఫుట్‌బాల్‌ జట్టుకు అంకితమిస్తున్నాం’ అని ట్విటర్‌లో పేర్కొన్నాడు. 12 మంది బాలల ఫొటోలను కూడా పాల్‌ జత చేశాడు. బుధవారం జరిగే రెండో సెవ్గిూ/నైల్లో ఇంగ్లాండ్‌-క్రియేషియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ్గ/నైల్లో ఫ్రాన్స్‌తో తలపడనుంది. అయితే , గుహ నిర్బంధంలో చిక్కుకున్న 12 మంది ఫుట్‌బాల్‌ జట్టు ఆటగాళ్లు జులై 15న జరిగే ్గ/నైల్‌ చూసేందుకు రావాలంటూ ముందుగా ఫిఫా నిర్వాహకులు ఆహ్వానం పంపారు. ఐతే, బాలల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, వైద్యుల సలహా మేరకు వారిని ్గ/నైల్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు రావొద్దని సమాచారం అందించినట్లు ఫిఫా ప్రతినిధి ఒకరు తెలిపారు.

Other News

Comments are closed.