ఉచిత మెగా హెల్త్ క్యాంప్ విజయవంతం…

share on facebook
నిజామాబాద్ బ్యూరో,జనవరి 13(జనంసాక్షి):నగరంలోని 45 డివిజన్ లో రాజీవ్ నగర్ హనుమాన్ మందిరం అధ్యక్షుడు పిప్పెర రంజిత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు.ఈ ఉచిత మెగా క్యాంప్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీనియర్ నాయకుల గడుగు గంగాధర్, స్థానిక కార్పొరేటర్  మాయవర్ సాయిరాం, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ సంతోష్ డాక్టర్ రచన డాక్టర్ రాఘవేందర్ డాక్టర్ కేశవులు డాక్టర్ శ్రీపాద రావు డాక్టర్ ప్రగతి లు పాల్గొని ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలకి వివిధ ఆరోగ్య చికిత్సలు నిర్వహించి వారికి తగిన వైద్యం అందించారు.ఈ సందర్భంగా పిప్పర రంజిత్ మాట్లాడుతూ మా కాలని లో ఒక మంచి కార్యక్రమం చేయలనుకున్నాను అందరికీ ఉపయోగపడేలా మెగా హెల్త్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అన్నారు.అలాగే నేను ఆహ్వానిo చగానే విచ్చేసిన డాక్టర్లు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Other News

Comments are closed.