ఉత్తరప్రదేశ్ లో భారీ ప్రమాదం

share on facebook

ఉత్తరప్రదేశ్(జ‌నం సాక్షి):ఉత్తరప్రదేశ్ లో ఆదివారం(జులై-22) భారీ ప్రమాదం జరిగింది. ఘజియాబాద్ లోని మిస్సాల్ గడి దగ్గర్లోని నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. కూలీలు పనిచేస్తున్న సమయంలో బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. . NDRF , UP పోలీసు బలగాలు, ఫైర్ డిపార్ట్ మెంట్ స్పాట్ కి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టాయి. శిథిలాల కింద చిక్కుకుపోయిన ఎనిమిది మందిని బయటకు తీశారు. ట్రీట్ మెంట్ కోసం వీరిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన మరో ఆరుగురిని త్వరగా బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నిస్తుందని నోయిడా పోలీస్ డీజీ సంజయ్ కుమార్ తెలిపారు.

Other News

Comments are closed.