ఉపాధి కూలీలకు తప్పనిసరిగా పనులు

share on facebook

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి):రైతులు, గ్రామ అవసరాల ప్రకారం జాతీయ గ్రావిూణ ఉపాధి హావిూ పథకంలో పనులను చేపట్టి కూలీలకు వంద రోజుల పని దినాలను కల్పించాలని రాష్ట్ర గ్రావిూణాభివృద్ధి శాఖ
అధికారులు ఆదేశించారు.  గ్రామాల్లో రైతుల అవసరాలను గ్రామ అవసరాలను పనులు ప్రతిపాదించి నిర్వహించాలన్నారు. వాటర్‌ కన్జర్వేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పించి ప్రతీ ఇంట్లో ఇంకుడు గుంతలను నిర్మించుకునేలా చూడాలని తెలిపారు. పంచాయతీ రాజ్‌, ఆర్‌అండ్‌బీ రోడ్లకు ఇరువైపులా కాంటూర్‌ కందకాలు ఏర్పాటు చేసి నీటిని నిలువ చేయాలని సూచించారు. ప్రతి నీటి బొట్టునూ సంరక్షించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఊరురా కళాకారులతో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్మించుకున్న వారి బిల్లుల చెల్లింపులు తక్షణమే చేల్లించాలన్నారు. 2018 అక్టోబర్‌ రెండు నాటికి రాష్ట్రాన్ని బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా ప్రకటించనున్నామన్నారు. ప్రతి గ్రామంలో శ్మశాన వాటికల ఏర్పాటు, రూ.పది లక్షలతో వైకుంఠ ధామం వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు.

Other News

Comments are closed.