ఉపాధ్యాయుల ఆందోళన

share on facebook

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. తార్నాకలోని సెయింట్‌ ఆన్స్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి మూల్యాంకన కేంద్రం వద్ద ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యారంగ ఉద్యోగులకు ముఖ్యమంత్రి అనేక హావిూలు ఇచ్చారని.. అవి ఇప్పటి వరకు అమలు చేయకపోవడం దారుణమని అన్నారు. ఉపాధ్యాయుల పదోన్నతలను తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఆందోళనలో పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.