ఉమమడి జిల్లాలో కార్మికుల నిరసన

share on facebook

సర్కార్‌ తీరుపై మండిపడ్డ నేతలు

మెదక్‌,అక్టోబర్‌9 (జనం సాక్షి):  ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ సమ్మె ఉదృథంగా సాగుతోంది. కార్మికులు డిపోల ముందు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తక్షణం తమ సమస్యలు పరిష్కరించాలని డియమాండ్‌ చేశారు. రాష్ట్రంలోని అన్నివర్గాల మద్దతును కూడకట్టుకుని రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మించి నియంత ప్రభుత్వానికి బుద్ధి చెప్పే వరకు విశ్రమించేదిలేదని ఆర్టీసీ టీఎంయూ రాష్ట్రకార్యదర్శి ఎంఆర్‌కె రావు పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు నల్లబ్యాడ్జీలతో పట్టణంలో నిరసనలు వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించక పోవటంతోనే సమ్మెబాట పట్టామన్నారు. సమస్య పరిష్కరించకుండా ప్రభుత్వం కార్మికులను బెదిరించటం ఎంతవరకు సమంజసమన్నారు. రాష్ట్రంలో 55 వేల మందికార్మికులు ఒక్కమాటపై నిలబడి సమ్మెలో కొనసగాడం కార్మికుల నైతిక విజయం అని అన్నారు. రాష్ట్రంలో రైతుల నుంచి మొదలుకుని అందర్ని మోసం చేసిన కేసీఆర్‌కు గతంలో చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని ఎంఆర్‌కే రావు అన్నారు. ఒక్క ఉద్యోగిని తొలగించనా రాష్ట్రం అగ్నిగుండం కావటం ఖాయమని ఎంఆర్‌కె రావు అన్నారు. ఆటోడ్రైవర్లను లారీడ్రైవర్లును తీసుకొచ్చి ఎలాంటి టికెట్లు లేకుండా బస్సులను నడపిస్తూ సీఎం దోపిడిదారితనానికి ఆజ్యం పోస్తున్న నియంత సీఎం కేసీఆర్‌ అని విమర్శించారు. సీఎం ఇచ్చిన హామాలనే నెరవేర్చ కుండా మాపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. టీచర్లను, రైతులను, నిరుద్యోగులను, ఆర్టీసీ కార్మికులను, ఉపాద్యాయులను, ఉద్యోగులను అందరిని మోసం చేసిన నియంత పాలనకు చరమగీతం పాడేందుకు అన్నివర్గాల ప్రజలం ఏకం కావల్సిన సమయం ఆసన్న

మైందన్నారు. కార్యక్రమానికి సీఐటీయూతో పాటు పలు ఉపాద్యాయ సంఘాలు మద్దతును ఇచ్చాయి.

Other News

Comments are closed.