ఉమ్మడి అంశాలు ఆధారంగా కూటమి ప్రచారం

share on facebook

తెలంగాణలో విజయంతో పాటు కెసిఆర్‌ను గద్దెదించడమే లక్ష్యంగా మహాకూటమి నాయకులు వ్యూహ రచన చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా విమర్శలకు పదను పెడుతున్నారు. కెసిఆరన్‌ ఇచ్చిన హావిూలను ప్రధానంగా తీసుకుని వాటికి పదును పెడుతున్నారు. మిషన్‌ భగీరత ద్వారా ఇంటింటికి నీరు ఇవ్వకుంటే ఓట్లు అడగనని చెప్పి, హావిూలను అమలు చేయకుండానే 9నెలల ముందు అసెంబ్ల ఈరద్దుపై నిలదీస్తు న్నారు. ఇకపోతే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కూడా ప్రచాఆరంలో భాగం అయ్యాయి. నిరుద్యోగ సమస్య ఓ భాగం అయ్యింది. ఇందిరాపార్క్‌ వద్ద ధర్నా చౌక్‌ ఎత్తివేత మరో సమస్యగా మారింది. ఇలా అనేకానేక సమస్యలను క్రీడీకరిస్తున్నారు. మహాకూటమి ఉమ్మడి ఎజెండాలో ఈ అంవాలను చేర్చి ప్రజలకు వివరించే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇకపోతే రాజకీయంగా బిజెపితో కెసిఆర్‌ లోపాయకారి ఒప్పందం.. బహిరంగంగా ఎంఊఎంతో ఒప్పందాలను బాగా ప్రచారం చయబోతున్నారు. ఇందులో మొదటిది ప్రధాని నరేంద్రమోదీతో కేసీఆర్‌ కుమ్మక్కు అయ్యారన్నది. ఈ అభిప్రాయాన్ని విస్తృతంగా వ్యాపింపచేయడం ద్వారా ముస్లింలను కేసీఆర్‌కు దూరం చేయాలన్నది కూటమి ఆలోచనగా ఉంది. అలాగే ఎంపైఎంతో పొత్తు ద్వారా హిందుత్వ ఓట్లను దెబ్బతీయాలన్నది కూడా మరో వ్యూహం. ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీతో కేసీఆర్‌ మరింత అంటకాగుతారని ముస్లింలను నమ్మించడానికై గులాంనబీ ఆజాద్‌ను కాంగ్రెస్‌  రంగంలోకి దించిందని అర్థం అవుతోంది. ముందస్తు ఎన్నికలకు కారణం ఏమిటో చెప్పాలని నిలదీయడం ద్వారా అసలు కెసిఆర్‌కు భయం పట్టుకుందన్న ప్రచారం చేయబోతున్నారు. కేసీఆర్‌ అహంకారపూరితంగా వ్యవహరిస్తుండటం వల్లనే ముందస్తుకు వెళుతున్నారని ప్రజలలోకి బలంగా తీసుకెళ్లాలని కూటమి నాయకులు తలపోస్తున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ఎవరినీ కలవరన్న అభిప్రాయం ఇప్పటికే ఉన్నందున దాన్ని మరింత బలంగా ప్రజలలోకి తీసుకెళ్లి లబ్దిపొందాలని చూస్తున్నారు. సచివాలయంలోకి రాకుండా ప్రగతి భవన్‌  అనే గడీలో కూర్చుని ప్రచారం చేస్తున్నారని ఇప్పటికే విస్తృతంగా ప్రాచరం చేపట్టారు. కేసీఆర్‌కు అహంకారం ఎక్కువని, అందుకే గడీల పాలన మొదలయ్యిందని ప్రజలను నమ్మించేలా చూస్తున్నారు. ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను కూడా పార్టీ అభ్యర్థులుగా కేసీఆర్‌ తిరిగి ఎంపిక చేయడంతో ఆయా స్థానాల్లో గట్టి అభ్యర్థులను నిలబెట్టి పాతవారి బాగోతాలపై ప్రచారం ఉధృతం చేయాలని అనుకుంటున్నారు. 105 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను ముందస్తుగా ప్రకటించడంతో దీంతో పలు నియోజకవర్గాలలో అభ్యర్థులకు వ్యతిరేకంగా ఆశావహులు బలప్రదర్శనలు మొదలుపెట్టారు. తామూ బరిలో దిగుతామని హెచ్చరికలు చేస్తున్నారు. కొందరు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. దీనికి తోడు బీఫారాలు ఇచ్చే నాటికి ప్రకటించిన అభ్యర్థులలో కొందరిని మార్చే అవకాశం ఉందని వార్తలు రావడంతో అసమ్మతిరాగాలు ఊపందుకున్నాయి. ముందస్తుగా అంతమంది అభ్యర్థులను ప్రకటించడం వల్ల టిఆర్‌ఎస్‌లో కొత్త చిక్కులు మొదలయ్యాయి. ప్రకటిత అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. వారిని వ్యతిరేకిస్తున్నవారు కూడా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉన్నవారికి కూడా కేసీఆర్‌ తిరిగి టికెట్లు ఇవ్వడంపై ప్రజలలో ఆగ్రహం వ్యక్తం అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పలువురు తాజా మాజీ ఎమ్మెల్యే లపై ప్రజలలో 60 శాతానికి పైగా వ్యతిరేకత ఉంది. ఈ పరిణామాలన్నింటినీ గమనించిన మహాకూటమి నాయకులు దీనిని అవకాశంగా తీసుకుని ప్రజలలోకి బలంగా తీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కూటమి ఉమ్మడి ప్రణాళికను సిద్దం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను ప్రధాన ప్రచారాస్త్రంగా మలచుకోవడం కూడా వారి వ్యూహంలో భాగంగా ఉన్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్‌పై ఉన్న
వ్యతిరేకతతో పాటు మాజీలపై ఉన్న వ్యతిరేకతపైనే ప్రజల దృష్టి మళ్లేలా చేయాలని కూటమి నేతలు నిర్ణయించుకున్నారు. ఈ మూడు అంశాలు ప్రజలపై ప్రభావం చూపితే కేసీఆర్‌ విజయం కోసం ఎదురీద వలసివస్తుందన్నది మహా కూటమి నాయకుల అంచనాగా ఉంది. పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ తదితర అంశాలు కూడా ప్రచారంలో భాగస్వామ్యం కాబోతు న్నాయి.  దీనికితోడు ఉద్యోగుల పెన్షన్‌ విధానం కూడా ఓ అంశంగా తీసుకుని రాబోతున్నారు.  కేసీఆర్‌ను ఓడించాలనుకుంటున్న మహాకూటమి అనుకున్నది సాధించాలంటే అనేక అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుంది. పొత్తు కుదుర్చుకోవడం వేరు? సీట్ల పంపకం వేరు. ఎవరెన్ని సీట్లకు పోటీ చేయాలన్న విషయం లో వివాదాలు పరిష్కారం కావాలి. ఆ తర్వాత ఎవరెక్కడ పోటీ చేయాలన్నది తేలవలసి ఉంటుంది. ఇదే పెద్ద సమస్యకాబోతున్నది. తామంతా గెలుస్తామన్న ధీమాలో ఉన్నవారు సీట్లను పంచుకోవడంలో ముందు ఏకాభిప్రాయం చూపాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు నిర్వహించిన అన్ని సర్వేలలో కేసీఆర్‌ విజయానికి ఢోకా లేదనే తేలింది. ప్రధానంగా రైతులకు పెట్టుబడి సాయం, బీమా కల్పన, నిరంతర విద్యుత్‌, మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కెసిఆర్‌కు బలమైన అంశాలుగా ఉన్నాయి. వీటిపై ప్రచారం పెద్దగా వ్యతిరేకత చూపకపోవచ్చని పరిశీలకులు కూడా భావిస్తున్నారు. కాకుంటే వారి ప్రచార  ప్రభావం ఎంత ఉంటుందన్నది ఇప్పటికిప్పుడు అంచనా వేయలేం.
———
అసమ్మతిరాగంతో గులాబీలో గుబులు
అభ్యర్థుల మార్పు తప్పదన్న ధీమాలో నేతలు
హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(ఆర్‌ఎన్‌ఎ): టిఆర్‌ఎస్‌లో టిక్కెట్ల కేటాయింపుతో పలు జిల్లాల్లో ఆశావహులు ఇతర పార్టీనలు చూసుకుంటున్నారు. అలాగే పలుచోట్ల ఆందోళనలు ప్రదర్శనలు చేస్తున్నారు. ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేన్‌ నాటికి మళ్లీ జాబితాలో మార్పు ఉంటుందని భావిస్తున్నారు. ఫలానా అభ్యర్థి మార్పు తప్పదని అనుకుంటున్నారు. ఇది ఏ ఒక్క జిల్లాకో పరిమితం కావడం లేదు. దాదాపు అన్ని జిల్లాల్లో కనీసం ఒకటి రెండు చోట్లయినా అసమ్మతి తీవ్రంగా ఉంది. అయితే అభ్యర్థులను మార్చేది లేదని సెం కెసిఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. ప్రకటించిన వారికి మద్దతుగా ప్రచారం చేయాలని కూడా సూచించారు.
ప్రస్తుత అంచనాల ప్రకారం పూర్వపు ఆదిలాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాలలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బలంగా ఉంది. తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ అయిన ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పార్టీ కొంత బలహీనపడటం ఆశ్చర్యంగా ఉంది. మిగతా తెలంగాణ జిల్లాలలో కాంగ్రెస్‌ పార్టీ గట్టి పోటీని ఇచ్చే పరిస్థితిలో ఉంది. పార్టీ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాలలో కూడా అభ్యర్థులలో కొందరిపై చాలా వ్యతిరేకత ఉంది. ఈ పరిస్థితి అధిగమించడానికి కేసీఆర్‌ ఏమి చేస్తారో చూడాలి. మరోవైపు క్షేత్రస్థాయిలో  ప్రభుత్వపరంగా జరుగుతున్న లోటుపాట్లు బయటకు రావడం లేదు. అయితే వాటిపై చర్చ జరుగుతోంది. అందుకే ఇప్పుడు సోషల్‌ విూడియాలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యతిరేక వర్గాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఆయా పనియోజకవర్గాల్లో వ్యతిరేకతలు కూడా బాగా ప్రచారం పొందుతున్నాయి. ఎక్కడిక్కడ వారు తమ అభిప్రాయాలను వెల్లడించడానికి సోషల్‌ విూడియాను ఆశ్రయిస్తున్నారు. ఇదంతా అధినేత కెసిఆర్‌ దృష్టికి చేరాలని కోరుకుంటున్నారు. కోదాడలో దివంగత శంకరమ్మ ఈటు కోం కొట్లాడుతున్నారు. స్టేషన్‌ ఘనాపూర్‌, జనగామ,వైరా, దేవరకొండ తదితరు ప్రాంతాల్లో కూడా ఇలాంటి అనుభవాలే ఉన్నాయి. వీటన్నిటిని ఎదరించే స్థాయి స్థానిక నేతలకు లేకున్నా
హల్‌చల్‌ చేస్తున్నారు.
————————-
చేరికల కార్యక్రమంతో ప్రచార ¬రు
నిత్యం ఏదో ఒకచోట చేరికలు ఉండేలా ప్లాన్‌
గులాబీ వ్యూహంతో చిత్తవుతున్న విపక్షాలు
హైదరాబాద్‌,సెప్టెంబర్‌24(ఆర్‌ఎన్‌ఎ): టీఆర్‌ఎస్‌లోకి వలసల జోరు కొనసాగుతోంది. ప్రతిపక్షాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేర్చుకునే కార్యక్రమానలు నిత్యం కొనసాగిస్తున్నారు.  చేరికల పరంపరతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్సహం నెలకొంది. నెల 6న అసెంబ్లీ రద్దు, అదేరోజు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 105 మంది అభ్యర్థులను ప్రకటించడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరుసటి రోజు నుంచి అభ్యర్థులు తమతమ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారంలో దూకుడు పెంచారు. మండలాలు, గ్రామాలు, పల్లెలు కలియ తిరుగుతూ పార్టీశ్రేణుల్లో జోష్‌ నింపారు. దీంతో ఇతర పార్టీలకు చెందిన ప్రథమ, ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరేందకు క్యూ కట్టారు. ప్రతిపక్షాలకు చెందిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు ఎక్కడికక్కడే గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గులాబీ దళం రెట్టించిన ఉత్సాహంతో జోరుగా ప్రచారం నిర్వహిస్తోంది. పల్లెలు, గ్రామాలు, మండలాలే కదిలివచ్చి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకే మద్దతు ప్రకటిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీలు ఖాళీ అవడంతో తమ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని టీఆర్‌ఎస్‌ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కారు స్పీడ్‌ను తట్టుకోలేక ప్రతిపక్షాలు బేజారవుతున్నాయని చెబుతున్నారు. ఆయా గ్రామాల నుంచి చేరికలు కొనసాగేలా రోజుకో చోట ఆకర్యక్రమానలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఇదంతా చేస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లోని అన్ని  వర్గాలు టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారు. తండాలు, గూడేలు, చిన్నచిన్న కాలనీల్లోని జనం కారు గుర్తుకే ఓటేస్తామని ముక్తకంఠంతో ప్రకటిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకు అనుగుణంగా ర్యాలీలు నిర్వహిస్తూ అభ్యర్థుల గెలుపునకు సహకరిస్తామని మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు ఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులు గ్రామాల్లో పర్యటిస్తున్న క్రమంలో ప్రజలు ప్రచారం లో పాల్గొనేలా చేస్తున్నారు. అభ్యర్థుల నుదట కుంకుమ తిలకం దిద్ది ఆశీర్వదిస్తున్నారు. మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు. కోలాటాలు, డప్పు చప్పుళ్లతో నృత్యం చేస్తూ విజయయాత్రలను తలపించే విధంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. జనంతో కలిసిపోయి నృత్యాలు చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.  ప్రతిపక్షాలు జట్టుకట్టి మహాకూటమి ఏర్పడిన సందర్భంగా ఏ నియోజకవర్గం నుంచి ఎవరికీ టికెట్‌ ఇస్తారనే విషయంలో స్పష్టత కరువైంది. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారంలో స్పీడ్‌ పెంచడంతో  ప్రతిపక్షాల నుంచి వలసలు జోరు కొనసాగుతున్నాయి. దీంతో ఆయా పార్టీశ్రేణులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
————-
రాహుల్‌కు కలసి వస్తోన్న రాపెల్‌ దుమారం
మోడీ మెడకు చుట్టుకుంటున్న ఒప్పందం
న్యూఢిల్లీ,సెప్టెంబర్‌24(ఆర్‌ఎన్‌ఎ):రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలె ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు ¬లాండ్‌ చేసిన సంచలన ప్రకటనతో మిస్టర్‌ క్లీన్‌గా ప్రచారం పొందుతూ వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభ అమాంతం పడిపోయింది. దీనిపై స్పష్టత ఇవ్వాలని, ఒప్పందాలు బయటపెట్టాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాందీ చేస్తున్న డిమాండ్‌కు ప్రజల్లోనే కాకుండ ఆరాజకీయంగా మద్దతు పెరుగుతోంది. దీంతో ఇప్పుడు సమాచారం ఇవ్వకుండా దాటవేస్తున్న ప్రధఇ మోడీ విమర్వలకు జడుస్తున్నట్లుగా ఉంది. ఈ వ్యవహారంలో రాహుల్‌ విమర్శలు బాగానే పనిచేస్తున్నాయి. దీంతో మోడీ
పీకలలోతు కష్టాలలో చిక్కుకున్నారు. భారత ప్రభుత్వం సూచన మేరకే రిలయన్స్‌ కంపెనీని భాగస్వామిగా అంగీకరించవలసి వచ్చిందని ¬లాండ్‌ స్పష్టంచేయడంతో మోదీ ఆత్మరక్షణలో పడిపోయారు. ఇప్పటివరకు ఈ విషయంపై దబాయిస్తూ వచ్చిన మోదీ సర్కారు ఇప్పుడు కూడా ఇంకా దబాయింపు అస్త్రాన్నే ఎంచుకోవడంతో రాహుల్‌కు కలసి వస్తోంది. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తొలుత ఆరోపించినప్పుడు దాన్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. ఇప్పుడు ఆ డీల్‌ కుదిరినప్పడు ఫ్రాన్స్‌ అధ్యక్షుడిగా ఉన్న ¬లాండ్‌ చేసిన ప్రకటనతో రాహుల్‌గాంధీ విశ్వసనీయతే కాదు, ఆయన నాయకత్వంపైనా భరోసా పెరిగింది. తాము తప్ప దేశంలో అందరూ అవినీతిపరులేనని ఇప్పటివరకు నోరుపారేసుకుంటూ వస్తున్న బీజేపీ నాయకులకు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. రిలయన్స్‌కు కేటాయించడం అన్నది కేవలం కావాలనే చేసిన వ్వయహారంగా కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. గతంలో బోఫోర్స్‌ కొనుగోలు వ్యవహారం బయటకు వచ్చేవరకు నాటి ప్రధాని రాజీవ్‌గాంధీని మిస్టర్‌ క్లీన్‌గానే భావించేవారు. ఒక్క బోఫోర్స్‌ వ్యవహారంతో రాజీవ్‌గాంధీకి మకిలి అంటుకుని తర్వాత జరిగిన ఎన్నికలలో అధికారాన్ని కూడా కోల్పోయారు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తాను ఒక్కడినే నీతిమంతుడనని భ్రమింపజేస్తూ వచ్చారు. రాఫెల్‌ దెబ్బతో మోడీ తనకుతాను నిర్మించుకున్న క్లీన్‌ ఇమేజ్‌ను పూర్తిగా కోల్పోయారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు ఎంత బుకాయించడానికి ప్రయత్నించినా ప్రజలను మాత్రం నమ్మించలేని పరిస్థితి రావడంతో రానున్న ఎన్నికల్లో ఇదో బాంబులాగా పనిచేసి కాంగ్రెస్‌కుఏ అబ్ది చేకూరర్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేకుండా పోయింది.  ప్రధానమంత్రిగా అహంభావంతో వ్యవహరిస్తూ వచ్చినా, నిజాయితీ పరుడన్న ఏకైక భావనతో నరేంద్ర మోదీపై ప్రజలలో ఇంతకాలం బావన ఉంది. నిజాయితీకి చిరునామాగా కీర్తి పొందుతూ వచ్చిన నరేంద్ర మోదీ కూడా వివాదంలో చిక్కుకున్నారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు ఎంత దీటుగా ప్రతిస్పందిస్తాయన్న దాన్నిబట్టి వచ్చే ఎన్నికలలో బీజేపీ జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. బోఫోర్స్‌ కుంభకోణం జరిగినప్పుడు ప్రతిపక్షాల ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామాలు చేసి ప్రజలలోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా ప్రతిపక్షాలు అదే మార్గాన్ని ఎంచుకుంటే ప్రధాని మోదీకి కష్టాలు తప్పవు. బోఫోర్స్‌ కుంభకోణం రాజీవ్‌గాంధీకి అధికారాన్ని దూరం చేస్తే.. రాఫెల్‌ కుంభకోణం ఆయన కుమారుడైన రాహుల్‌ గాంధీకి అధికారాన్ని అప్పగిస్తుందా అన్నది  చూడాలి. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో అవకతవకలను తొలిసారిగా ఎత్తిచూపిన రాహుల్‌ గాంధీ రాజకీయంగా పరిణతి పొందారనే భావించాలి.
———————-
అంతర్జాతీయంగా పాక్‌ను ఎండగట్టాల్సిందే
సరిహద్దుల్లో భద్రత పెంచడం ద్వారా గట్టిగా బుద్ది చెప్పాలి
న్యూఢిల్లీ,సెప్టెంబర్‌24(ఆర్‌ఎన్‌ఎ): జమ్మూ కాశ్మీర్‌లోఉగ్రవాదుల దాడి అనంతరం అలాంటి టెర్రరిస్ట్‌ లను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ను అంతర్జాతీయ వేదికలపై వేలెత్తి చూపి ఆ దేశాన్ని ఏకాకిని చేయడంలో భారత ప్రభుత్వం దౌత్య పరమైన విజయం సాధించింది. ఇదే తీరును మరింతగా ప్రపంచానికి ఎలుగెత్తి చాటాలని విదేశాంగ నిపుణలుతో పాటు రాజకీయ ప్రముఖులు  కూడా అభిప్రాయపడుతున్నారు. పాక్‌ను ఏకాకి చేయడంతో పాటు దౌత్యపరంగా ఒత్తిడి పెంచాలని సూచిస్తున్నారు. అదే క్రమంలో
సరిహద్దుల్లో చొరబాట్లను నిరోధించేందుకు కఠినంగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు. సరిహద్దుల్లో చొరబాట్లను నిర్దాక్షిణ్యంగా అణచివేయడం ద్వారా గట్టి హెచ్చరికలు చేయాలని సూచిస్తున్నారు.
అవసరమైతే సైన్యాన్ని సరిహద్దుల్లో పెంచాలని అంటున్నారు. పాకిస్తాన్‌ పట్ల భారతదేశం అనుసరిస్తున్న విధానంలోనూ, ముఖ్యంగా విదేశాంగ విధానం లోనూ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవల్సిన అవసరాన్ని యూరి ఉదంతం స్పష్టం చేసింది. టెర్రరిస్ట్‌లను ప్రేరేపించి పొరుగుదేశాలైన భారత్‌, ఆప్గనిస్తాన్‌లలో కల్లోలం సృష్టించడం దౌత్యవిధానంలో భాగంగా చేసుకున్న పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాలంటే భారత ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించవలసి ఉంటుంది. ప్రపంచ దేశాలు పాకిస్తాన్‌పై ఆంక్షలు కూడా విధించినా అయినప్పటికీ పాకిస్తాన్‌ కాశ్మీర్‌ ను కబళించాలన్న ఏకైక లక్ష్యంతో తమ దేశంలో టెర్రరిస్ట్‌ సంస్థలను ప్రోత్సహించి కాశ్మీర్‌ లోకి చొరబాటుదారులుగా పంపే విధానాన్ని ఎంచుకుంది. పాకిస్తాన్‌ ఆసియా ఖండంలో వ్యూహాత్మకంగా కీలకమైన దేశం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ అటు అమెరికా, రష్యా తోనూ, చైనా తోనూ సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది. టెర్రరిస్ట్‌లకు ఆశ్రయం ఇస్తున్న పాకిస్తాన్‌ విషయంలో అమెరికా కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నా.. ఆ దేశమే అమెరికాకు అతిపెద్ద ఆయుధ కొనుగోలుదారు అన్న విషయాన్ని గుర్తంచి వ్యూహాత్మకంగా భారత్‌ వ్యవహరించాల్సి ఉంది. చైనా- పాకిస్తాన్‌ మైత్రీ సంబంధాలు, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ లో ఉభయ దేశాలు సాగిస్తున్న కార్యకలాపాల పైన కూడా దృష్టి పెట్టాల్సి ఉంది. యూరి ఘటన తర్వాత భారతదేశ వ్యాప్తంగా పాక్‌ వ్యతిరేకత వెల్లువెత్తింది. పాక్‌ పై యుద్ధం ప్రకటించాలన్న భావన వ్యక్తమైంది. తక్షణం కాకపోయినా మొత్తం విూద పాకిస్తాన్‌పై పరోక్షంగానో, ప్రత్యక్షంగానో చర్యకు దిగుతామని రక్షణ మంత్రి తో సహా పలువురు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కాస్త సంయమనంతో వ్యవహరించక తప్పదు. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, పాక్‌ ప్రేరేపిత టెర్రరిజానికి క్లళెం వేసేందుకు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారని, ఇక పాకిస్తాన్‌ నుంచి టెర్రరిస్ట్‌ ల చొరబాటు తగ్గిపోతుందని దేశ ప్రజలు ఆశించిన మాట వాస్తవం. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత పాకిస్తాన్‌ పట్ల నరేంద్ర మోడీ వైఖరి మారినట్లు కనిపించింది.  టెర్రరిస్ట్‌ సంస్థలకు ఆశ్రయం మానుకోవడం, టెర్రరిస్ట్‌ సంస్థల స్థావరాలను నిర్మూలిస్తే తప్ప పాకిస్తాన్‌తో దౌత్య పరమైన చర్చలు జరపబోమని భారతప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవలి అనుభవాల దృష్ట్యా భారత దేశంలో అల్లకల్లోలం సృష్టించే యత్నిస్తున్న పాకిస్తాన్‌ పట్ల మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంది.  పాక్‌కు పాక్‌ భాషలోనే గట్టి సమాధానం చెప్పాల్సి ఉంది. పాకిస్తాన్‌ ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసినంత మాత్రాన సరిపోదు. పాకిస్తాన్‌ను టెర్రరిస్ట్‌ దేశంగా ప్రకటించేటట్లు అంతర్జాతీయంగా అన్ని దేశాలపై ఒత్తిడి పెంచాలి. తోటి ఇస్లామిక్‌ దేశాలు కూడా పాకిస్తాన్‌ నిర్వాకాన్ని అభిశంసించేలా కృషి చేయాలి. అమెరికాతోనూ, ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలోనూ తమ పలుకుబడి ఉపయోగించి పాకిస్తాన్‌ ను అన్ని విధాలా ఎండగట్టాలి. పాకిస్తాన్‌ తమ దేశంలో లష్కర్‌ ఇ తోయిబా వంటి టెర్రరిస్ట్‌ సంస్థలను నిషేధించడమే కాదు. ఆ టెర్రరిస్ట్‌ సంస్థల నాయకులకు ఆశ్రయం కల్పించే
కార్యకలాపాలకు స్వస్తి పలికేలా ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేయాలి. టెర్రరిస్ట్‌ సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తులు, నాయకుల జాబితా తయారుచేయించి ఆ వ్యక్తులకు పాకిస్తాన్‌తో సహా ప్రపంచంలో ఏ దేశం కూడా ఆశ్రయం కల్పించకుండా ఒత్తిడి పెంచాలి.
————

Other News

Comments are closed.