ఉమ్మడి జిల్లాలో వేడుకగా పంద్రాగస్ట్‌

share on facebook

మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కేంద్రంలో 72 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రభాత్‌ భేరిలో పాల్గొన్నారు. భారత్‌ మాతాకీ జై అనె నినాదాలు మిన్నంటాయి. తెలంగాణ చౌరస్తాలో కృష్ణ వేణి టాలెంట్‌ స్కూల్‌ కు చెందిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అలరించాయి. జిల్లా మక్తల్‌ పట్టణంలో స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో తహసీల్దార్‌ గౌరవ వందనం స్వీకరించారు. పలు పాఠశాలల్లో విద్యార్థులు చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. భారత స్వాతంత్య కోసం పలువురు తమ ప్రాణాలు ధారపోసారని అన్నారు. అందరినీ స్మరించుకుని వారికి నివాళి అర్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ హనుమంతు, జడ్పీటీసీశ్రీహరి, మార్కెట్‌ చర్మన్‌ నర్సింహా గౌడ్‌, టీఆరెస్‌ నేతలు రవిశంకర్‌, రాజేష్‌ గౌడ్‌, నిరంజన్‌, నర్సింహ పాల్గొన్నారు. మద్దూర్‌ మండల కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలలో 72 వ స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.. వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రభాత్‌ భేరిలో పాల్గొన్నారు. భారత్‌ మాతాకీ జై అనె నినాదాలు మిన్ను ముట్టాయి. నూతనంగా ప్రారంభించిన భాష్యం గ్రామర్‌ స్కూల్‌ కు చెందిన విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు,ఆటపాటలతో అలరించారు….కార్యక్రమంలో మండల అధికారులు, రాజకీయ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

——————

 

Other News

Comments are closed.