ఊటీలో ఘోర ప్రమాదం

share on facebook

లోయలో పడిన బస్సు.. ఏడుగురి మృతి

చెన్నై, జూన్‌14(జ‌నం సాక్షి) : తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఊటీ సవిూపంలోని కూనూర్‌ రోడ్డులో తమిళనాడు ఆర్టీసీ బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. మరో 28 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో బస్సులో 50 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఊటీ నుంచి కోయంబత్తూర్‌కు వెళ్తుండగా ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో క్షతగాత్రులను ఊటీలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో 8మంది విషమంగా ఉంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సులో లోయలో పడిన ప్రదేశంలో పరిస్థితి భయానకంగా ఉంది. ముక్కలు ముక్కలైన బస్సు శకలాల నడుమ విగతజీవులైన ప్రయాణికులు, రక్తచారికలతో ఆ ప్రాంతం బీభత్సంగా మారింది. సరికొత్త అందాలకు నెలవు అయిన ఊటిలో ఘోర ప్రమాదం జరగడంతో స్థానికంగా విషాదం నెలకొంది.

 

Other News

Comments are closed.